హోమ్ /వార్తలు /trending /

Viral News: గర్భిణుల కష్టాలను తెలుసుకోవాలనుకున్న టిక్‌టాకర్.. అతడి పరిస్థితి చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు

Viral News: గర్భిణుల కష్టాలను తెలుసుకోవాలనుకున్న టిక్‌టాకర్.. అతడి పరిస్థితి చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు

మహిళల ప్రసవ వేదన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ ప్రయోగం చేశాడో టిక్‌టాకర్. తన ప్రయోగానికి సంబంధించిన వీడియోని టిక్ టాక్ లో షేర్ చేశాడు. ఆ వీడియో చూసి నెటిజన్లు అతడి పరిస్థితికి నవ్వుతున్నారు.

  గర్భధారణ ఆడవారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టంగా అభివర్ణించవచ్చు. గర్భందాల్చిన క్షణం నుంచి మహిళలు పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటుంటారు. కడుపులోని బిడ్డకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా జాగ్రత్త పడుతుంటారు. నెలలు నిండుతున్న కొద్దీ వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. నిండు గర్భంతో ఉన్నప్పుడు వారు అనుభవించే వేదన సాటి తల్లులకు మాత్రమే తెలుస్తుంది. అయితే మహిళల ప్రసవ వేదన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ ప్రయోగం చేశాడో టిక్‌టాకర్. తన ప్రయోగానికి సంబంధించిన వీడియోని టిక్ టాక్ లో షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  ఈ వీడియోలో.. మెయిట్ ల్యాండ్ హాన్లీ అనే ఒక ప్రముఖ టిక్‌టాకర్ తన కడుపుకు ఒక పెద్ద పుచ్చకాయను ప్లాస్టర్ సాయంతో గట్టిగా కట్టుకున్నట్లు చూడొచ్చు. అలాగే గర్భిణీలా కనిపించేందుకు తన ఛాతీ చుట్టూ రెండు పుచ్చకాయలను చుట్టుకున్నాడు. కానీ గర్భిణీ వేషధారణలో ఉన్న హాన్లీ తాను పడుకున్న బెడ్ పైనుంచి కూడా లేవలేకపోయాడు. దాంతో గర్భిణీల బాధను భరించడం అంత సులువైన పనికాదని అతడికి క్షణాల్లోనే జ్ఞానోదయమైంది.

  గర్భిణీలు మోసే బరువుకు సమానంగా తన శరీరానికి పుచ్చకాయలు కట్టుకొని గర్భధారణ సమయంలో మహిళలు పడే బాధని తెలుసుకునేందుకే హాన్లీ ఈ ప్రయోగం చేశాడు. ఒకరోజు పాటు ఇదే వేషధారణలో ఉండాలి అనుకున్నాడు. అయితే ఊహించిన దానికంటే తక్కువ సమయంలోనే గర్భిణీలాగా నటించడం కష్టసాధ్యమని గ్రహించాడు. నిండు గర్భిణీగా నటించడం అనేది చాలా సులభం అనుకున్నానని కానీ తాను బెడ్ పై నుంచి కూడా లేవలేకపోయానని హాన్లీ చెప్పుకొచ్చాడు.

  గర్భిణీలను అనుసరించే ప్రయోగంలో భాగంగా మరికొన్ని ప్రయత్నాలు కూడా చేశాడు హాన్లీ. బాత్రూంకి వెళ్లడం.. షూస్ ధరించడం వంటివి అభినయించాడు కానీ ప్రతి ప్రయత్నంలోనూ చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే గర్భం ధరించిన మహిళలు ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటారో తెలియజేసేందుకు అతను తన వీడియోని నెట్టింట షేర్ చేశాడు.

  టిక్ టాక్ లో షేర్ చేసిన ఈ వీడియోలో.. "గర్భిణీలా నటించడం చాలా ఈజీ అనుకున్నాను" అని హాన్లీ చెప్పడం చూడొచ్చు. అయితే ఈ వీడియో క్లిప్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకి 17 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ టిక్ టాక్ వీడియోని ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారం లలో కూడా విస్తృతంగా షేర్ చేస్తున్నారు. గర్భిణీ వేషధారణలో ఉన్న అతడి పరిస్థితిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. గర్భిణీలు ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటారో తాము ఇప్పుడే తెలుసుకున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  First published:

  ఉత్తమ కథలు