HOME » NEWS » trending » A TIGER CUB WERE BRUTALLY TORTURED BY FOUR MEN IN GUJARAT VIRAL VIDEO KRS

Viral Video: పులి పిల్లను దారుణంగా హింసించారు

నలుగురు వ్యక్తులు చెరకు తోటలో ఓ పులి పిల్లను కాళ్లతో తొక్కుతూ దారుణంగా హింసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.  

news18-telugu
Updated: January 13, 2021, 1:42 PM IST
Viral Video: పులి పిల్లను దారుణంగా హింసించారు
Twitter Image
  • Share this:
నలుగురు కలిసి ఓ పులి పిల్లను కనికరం లేకుండా హింసించారు. అసహాయంగా ఉన్న దాన్ని చుట్టుముట్టారు. గుజరాత్​లోని గిర్​ సోమ్​నాథ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నలుగురు యువకులు ఏ పాపం తెలియని ఆ పులిపిల్లను కాలుతో తొక్కడం, ఎక్కడికి వెళ్లకుండా చేయడం లాంటి పనులు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఓ చెరుకు పొలం వద్ద ఈ ఘటన జరిగింది. ఆ పులి పిల్లను హింసిస్తూ వారు ఫోన్​లో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇది క్రూరమైన జంతువని, ఇలా చేయడం తప్పులేదని వారిలో ఒకరు అన్నట్టు వీడియోలో రికార్డయింది. ప్రస్తుత సీజన్​లో గిర్ సోమ్​నాథ్ జిల్లాలో చెరకు ఎక్కువగా పండిస్తారు. పొలాలు దట్టంగా ఉండడంతో అక్కడ దాచుకునేందుకు పులి పిల్లలు వస్తాయి. అలానే అక్కడ కంటపడిన పులిపిల్లను వారు హింసించారు. అయితే చూస్తేంటే వారు పర్యాటకుల్లా ఉన్నారు. అందునా ఈ ఘటన ఎక్కడ జరిగిందో కరెక్ట్ లొకేషన్ తెలియరాలేదు. అటవీ శాఖ అధికారులు సైతం ఈ విషయంపై ఎలాంటి విచారణ చేపట్టలేదు.


కాగా గుజరాత్​లో పులుల దాడులు ఎక్కువుతున్నాయి. ఇటీవల రెండు చోట్ల పులి దాడిలో ఇద్దరు మరణించారు. అయితే దాన్ని సాకుగా చూపి నిస్సహాయంగా ఉన్న పులిపిల్లను హింసించడం దారుణమని నెటిజన్లు అంటున్నారు. ఇది క్షమించరాని నేరమని కామెంట్లు చేశారు. ఒకవేళ ఆ చుట్టుపక్కల ఆ పులిపిల్ల అమ్మ ఉండి ఉంటే ఏం జరిగేదో గుర్తు చేసుకోండి అంటూ హింసించిన వారిని విమర్శిస్తున్నారు.
Published by: Krishna P
First published: January 13, 2021, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading