హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Talking parrot: ఈ చిలుక మామూలుది కాదండోయ్​.. అలిగి ఇంటి నుంచి పారిపోయింది.. ఎందుకు అలిగిందంటే..?  

Talking parrot: ఈ చిలుక మామూలుది కాదండోయ్​.. అలిగి ఇంటి నుంచి పారిపోయింది.. ఎందుకు అలిగిందంటే..?  

చిలుక

చిలుక

ఒక ప‌క్షి(Bird) అలిగి య‌జ‌మాని ఇంటి నుంచి పారిపోవ‌డం ఎప్పుడైనా చూశారా?  విన్నారా?  విన‌డానికి చూడ్డానికి ఆశ్చ‌ర్యంగా అనిపించే ఈ సంఘ‌ట‌న సూర్యాపేటలో (Suryapeta) చోటు చేసుకుంది

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  (Balakrishna, News18, Hyderabad)

  త‌ల్లిదండ్రులు తిట్టార‌నో లేక కొట్ట‌ర‌నో పిల్ల‌లు సాదార‌ణంగా అలిగి ఇళ్లు వ‌దిలి వెళ్లిపోవ‌డం చూశాం. కాని అదే అల్ల‌రు ముద్దుగా పెంచుకుంటున్న ఒక ప‌క్షి(Bird) అలిగి య‌జ‌మాని ఇంటి నుంచి పారిపోవ‌డం ఎప్పుడైనా చూశారా?  విన్నారా?  విన‌డానికి చూడ్డానికి ఆశ్చ‌ర్యంగా అనిపించే ఈ సంఘ‌ట‌న సూర్యాపేటలో (Suryapeta) చోటు చేసుకుంది.  సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లోని టీచర్స్‌ కాలనీ చెందిన పిల్లుట్ల రంజిత్ కుమార్ నాలుగేళ్ల క్రితం బెంగళూరు నుంచి ఆఫ్రికన్ గ్రే చిలుకను (Parrot) కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చారు.  ఆ చిలకకు ‘సీత’ అని పేరు కూడా పెట్టారు కుటుంబ సభ్యలు అతి కొద్ది రోజుల్లోనే, రంజిత్ (Ranjith) కుటుంబంలో ఒక భాగమైపోయింది.

  తమ పిల్లల కంటే ఈ చిలకను (Talking parrot) అల్లరు ముద్దుగా పెంచుకున్నారు కుటుంబ సభ్యులు. ఆ  చిలుకతో రోజు కొంచెం సేపు మాట్లాడితే కాని వాళ్లు రోజు గడవదు. అచ్చం మనిషిలానే చిలుక మాట్లాడటంతో చుట్టుపక్క వాళ్లు కూడా ప్రత్యేకమైన శ్రధ్ద ఈ కుటుంబం, చిలుక పై కూడా పెడుతూ ఉంటారు. అయితే  సెప్టెంబర్ 3 ఉదయం సీత అనే ఈ చిలుక తనకు సీతాఫలం కావాలని అడిగింది. అయితే సాయంత్రం తీసుకొస్తానని తీసుకురాలేదు సదరు యజమాని. దీంతో అలిగిన చిలుక (Talking parrot) సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లోని టీచర్స్‌ కాలనీలోని తన ఇంటి నుంచి పారిపోయింది.

  చిలుక కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారిని సంప్రదించారు. అయితే లాభం లేకపోవడంతో చిలుక తప్పిపోయిందని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు (Complaint) చేశారు కుటుంబ సభ్యులు. ఇంటి నుంచి పారిపోయిన చిలుక (Talking parrot) ఆచూకి నాలుగు రోజులు గడిచినా తెలియకపోవడంతో కుటుంబ సభ్యలు ఆందోళన చెందారు. చిలుక ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు  తిండి తిప్పలు మాని చిలుక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు.

  అయితే ఇంటి నుంచి పారిపోయిన (Ran away) చిలుక ఆచూకీ నాలుగు రోజులు తరువాత తెలిసింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఈ చిలుక (Talking parrot) ఉండటంతో స్కూల్ స్టూడేంట్స్ గమనించి స్కూల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో  ఆ చిలుక గురించి తెలుసుకున్న స్థానికులు రంజిత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని చిలుకను హత్తుకొని కన్నీటి పర్యంతం అయ్యారు.  అయితే స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లలను ఈ చిలుకే (Talking parrot) పలకరించడంతో తన ఆచూకీ తెలిసింది అంటున్నారు స్కూల్ టీచర్స్. పిల్లలు తమ వద్దకు వచ్చి అక్కడ ఒక బర్డ్ మాట్లాడుతుంది రండి అని తీసుకొని వెళ్లారని చెబుతున్నారు టీచర్స్.

  Theft: ష్‌.. గోడకు చెవులుంటాయ్‌.. వింటాయ్​.. మీ ఇల్లు దోచేస్తాయ్​.. బీ కేర్​ఫుల్

  ఆఫ్రికన్ గ్రే చిలుకలు (African gray parrots) విపరీతమైన తెలివితేటలు కలిగి ఉంటాయి. అందుకే దినికి 'ది ఐన్‌స్టీన్స్ ఆఫ్ ది బర్డ్ వరల్డ్' అనే పేరుంది. ఈ పక్షులు తరచుగా, సందర్భానుసారంగా మాట్లాడతాయని దీంతో మన భావోద్వేగాలను చాలా వరకు పట్టించుకుంటాయని అంటున్నారు నిపుణులు.  ఆఫ్రికన్ గ్రే చిలుకలు 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవని  రంజిత్ తెలిపారు. ప్రస్తుతం మా చిలుకకు మంచి తోడు చూస్తున్నామని త్వరలో దాన్ని ఒక ఇంటిదాన్ని చేస్తామని అంటున్నారు చిలుక యజమాని.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad, Trending news

  ఉత్తమ కథలు