పెళ్లి (Marriage) ప్రతీ మనిషి జీవితంలో అపరూప ఘట్టం. అది దైవ నిర్ణయం అని చాలామంది అంటుంటారు. అయితే కొంతమంది కెరీర్ (Career) లో సరిగ్గా స్థిరపడలేకపోవడంతో వాయిదా వేస్తూ వస్తుంటారు. కొంతమందికి త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. సరైన సంబంధం దొరక్కపోవడంతో పెళ్లి ఆలస్యం అవుతుంది. ఈ రెండు కారణాలు కాకుండా మరో కారణం కూడా ఉంది. పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండి కూడా కొన్ని కండీషన్ల వల్ల చేసుకోలేకపోతున్నారు. ఆ వింత కండీషన్లు ఏంటంటే.. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల విషయంలో రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు ఆగాలని కండీషన్లు పెడుతున్నారట.
అటు.. అమ్మాయి ఇలా రిక్వెస్ట్ చేస్తుండగా.. ఇటు అబ్బాయిలు కూడా ఆలానే ఉన్నారట. మరో రకం వారు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకోవడం ఓకె.. కానీ పిల్లలు అస్సలు వద్దు అని అనుకునే వారు కూడా ఉన్నారట. ఇలా పెళ్లి విషయంలో నిర్వహించిన ఓ సర్వేలో ఇంకా ఎన్నో వివరాలు తెలిశాయి. ఇక వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఇటీవల పెళ్లికాని యూత్ ను ఓ సర్వేలో భాగంగా ప్రశ్నింగగా.. కొన్ని సమాధానలు వినిపించాయి. అవి వింటానికి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఎలాగూ పుడతారు. అయితే పెళ్లి ఒక్కటే కావాలని.. పిల్లలు వద్దు అంటూ చెప్పే వారు ఉన్నారు. యూత్ సర్వే పేరుతో నిర్వహించిన అధ్యయనంలో 18-34 ఏళ్ల పడుచుప్రాయులు ఏకరువు పెట్టిన ఇంకొన్ని సంగతులు.
పెళ్లి అనేది ఎవరైనా చేసుకోవాల్సిందే.. అది జీవితంలో ముఖ్యమైన ఘట్టం అని 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా పర్వాలేదు అని అనుకునే వారు 27 శాతంగా తేలింది. 'అబ్బే.. మాకు పెళ్లి అక్కర్లేదు. సహజీవనమే చేస్తాం' అని తెగేసి చెప్పినవాళ్లు 21 శాతం మంది ఉన్నారు.
పెళ్లి తర్వాత పిల్లల విషయానికి వస్తే.. ఇందులో 54 శాతం మంది సంతానం కావాలని కోరుకుంటుంటే.. 18 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. 4 శాతం మంది ఎవరినైనా పెంచుకుంటాం అంటే.. ఇంకో 14 శాతం అసలు పిల్లల్నే అవసరం లేదు.. తాము కనం అని తెగేసి చెప్పేశారు. ఇక పెళ్లి, పిల్లలు రెండూ ముఖ్యమే అన్నవాళ్లు 38 శాతం మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 62 శాతం మంది పెళ్లి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇక సంతానం వద్దనుకునే వారు చెప్పిన కారణాలు ఏంటంటే.. పిల్లల్ని భారంగా భావించడం.. పెరుగుతున్న జీవన వ్యయాలు, భరించలేని ఖర్చులు.. విధి నిర్వహణలో భాగంగా చిన్నారులతో గడపడానికి సమయం లేదనుకోవడం.. ఇలా చెబుతున్నారు. ఏదేమైనా పెళ్లి అనేది జీవితంలో ఓ ముఖ్య ఘట్టం అనుకున్నటప్పుడు పిల్లలు కూడా అందులో భాగమే కావాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: After marriage, VIRAL NEWS