Home /News /trending /

A STUDENT IS CYCLING FROM KERALA TO KASHMIR TO SUPPORT ONGOING FARMERS PROTEST SU GH

All India cycle expedition: కేరళ నుంచి కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర.. లక్ష్యం మాత్రం అదే..

(Image credits: Twitter/@cyclingmonksIN)

(Image credits: Twitter/@cyclingmonksIN)

ఓ యువకుడి సైకిల్ యాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళ నుంచి కశ్మీర్ వరకు ఓ లక్ష్యంతో అతడు సైకిల్ యాత్ర చేపట్టాడు.

తిరువనంతపురం (Thiruvananthapuram) నుంచి సైకిల్ పై బయలు దేరిన ఈ విద్యార్థి కశ్మీర్ (Kashmir) వరకు జరిగే తన ప్రయాణానికి రైతుల ఉద్యమంపై అవగాహన కల్పిస్తూ సాగటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాజధాని ఢిల్లీ వేదికగా సాగుతున్న రెండు నెలల రైతుల ఉద్యమంపై సవివరంగా ప్రజలకు తెలియజేటాన్ని యజ్ఞంగా పెట్టుకున్న ఈ కేరళ విద్యార్థి పేరు జిబిన్ జార్జ్ సైకిల యాత్రను ప్రారంభించాడు. 22 ఏళ్ల జిబిన్ తిరువనంతపురం నుంచి సైకిల్ పై ప్రయాణిస్తూ కశ్మీర్ చేరుకోనున్నాడు. అంతేకాదు మార్గమధ్యలో ఢిల్లీలో (Delhi) రైతు ఉద్యమంలో (farmers protest) పాల్గొంటాడు. రైతుల సమస్యలపై ప్రజలకు ఏమాత్రం అవగాహన లేకపోవటం తనను బాధించిందని జిబిన్ చెబుతున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో 2వ సంవత్సరం చదువుతున్న ఇతను.. దక్షిణ భారతదేశంలో రైతు ఉద్యమంపై కనీస అవగాహన లేకపోవటం తనకు ఆశ్చర్యం కలగచేసిందంటున్నాడు. అందుకే ఆల్ ఇండియా సైకిల్ ఎక్స్పెడిషన్ చేపట్టి.. ఈ విషయంపై అన్ని రాష్ట్రాల్లోని రైతులకు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తానంటున్నాడు. మనదేశానికి వెన్నెముక అయిన రైతులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయంటున్నాడు. కొత్త రైతు చట్టాలపై తనకు అవగాహన ఉందని, దీన్ని రైతులందరికీ వివరించాల్సిన సమయం వచ్చిందంటున్నాడు. రైతులకు అసరమైన మద్దతు, గౌరవం దక్కేలా చూడటం తన ప్రధాన లక్ష్యమని జిబిన్ చెప్పుకొచ్చాడు.

తీరం వెంబడి యాత్ర
కోస్టల్ రోడ్లపైన తన సైకిల్ యాత్ర ద్వారా ముందు మహారాష్ట్ర, అక్కడి నుంచి గోవా (Goa) మీదుగా కశ్మీర్ వెళ్లేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నాడు. జమ్మూకశ్మీర్ లో తన సైకిల్ యాత్ర ముగించేలా.. ఢిల్లీ వెలుపల గత 60 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా తనవంతు పాత్ర పోషిస్తానంటున్నాడు. ఇప్పటివరకు సాగిన తన సైకిల్ యాత్రలో తాను వెళ్లినచోటల్లా తాను చెప్పే విషయాన్ని అందరూ ఆసక్తిగా విన్నారని హర్షం వ్యక్తంచేశాడు జిబిన్.

వ్యవసాయ సంస్కరణ చట్టాలు..
మనదేశంలో అత్యధిక రైతులకు అక్షరజ్ఞానం లేనందున సాగు చట్టాలు.. కేంద్రం తెస్తున్న సంస్కరణలపై కనీస అవగాహన కొరవడిందని జిబిన్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. అత్యధికంగా పంజాబ్ (Punjab), హర్యానా (Haryana) ల నుంచి వచ్చిన వేలాదమంది రైతులు చలి, వాన, ఎండలను లెక్కచేయక గుడారాల్లోనే ఆహారం వండుకుంటూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇప్పటికే చలికి, వర్షాలకు కొందరు రైతులు మరణించగా, మరికొందరు రైతన్నలు ఇక్కడే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేవలం కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ చర్యలున్నాయంటూ రైతులు ఉద్యమించిన నేపథ్యంలో రైతు సంఘాలకు కేంద్రానికి మధ్య పలు దఫాలుగా సాగిన చర్చలు విఫలమయ్యాయి. కాగా కేంద్రం కొత్త సవరణలు వెనక్కు తీసుకునేవరకూ ఉద్యమం సాగనున్నట్టు రైతులు వెల్లడించారు. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అయితే ఇలా చట్టాలను కొంతకాలంపాటు నిలిపివేయటం పరిష్కారం కాదని, చట్టాలను ఉపసంహరించుకునేవరకూ తమ ఉద్యమం సాగుతుందని రైతు సంఘాలు ఇప్పటికే ప్రకటన చేసాయి.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Farmers Protest, New Agriculture Acts

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు