చెత్తకుప్పల్లో తిరిగే శునకం.. సినిమా స్టార్ అయ్యింది

వెండితెర మీద స్టార్‌గా ఎదగాలంటే మాటలు కాదు. నేపథ్యం భారీగానైనా ఉండాలి.. అదృష్టమైనా కలిసి రావాలి. అంతకు మించి నటీనటులు కృషి, పట్టుదల కలిగి ఉండాలి. కానీ చెత్తకుప్పల్లో తిరుగాడే ఓ శునకం మాత్రం ఇవేమీ లేకుండా సినిమా స్టారైపోయింది.

news18-telugu
Updated: February 18, 2019, 2:11 PM IST
చెత్తకుప్పల్లో తిరిగే శునకం.. సినిమా స్టార్ అయ్యింది
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో ఏ కొందరికో అవకాశం లభిస్తుంది. అదృష్టం కలిసొచ్చి స్టార్లుగా ఎదుగుతున్నారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అంతా ఇదే పరిస్థితి. కానీ లాస్ ఏంజిల్స్‌లోని చెత్తకుప్పల్లో తిరిగే ఓ శునకం.. అనూహ్యంగా వెండితెర స్టార్‌గా మారిపోయింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆ కుక్కే. దీని నామధ్యేయం షెల్బై. పాపం..చెత్తకుప్పల్లో తిరుగుతూ ఉండేది. అలా తిరుతుండగా.. అటుగా వెళ్తున్న ఎనిమల్ కంట్రోల్ అధికారి మేగన్‌ కంటపడింది. దీంతో ఆమె చెత్తకుప్పల్లో తిరుగుతన్న ఆ కుక్కను తన ఎనిమల్ షెల్టర్‌కు తీసుకెళ్లింది. దానికి షెల్బై అనే పేరు పెట్టింది.

ఇక, అదే సమయంలో శునకానికి సంబంధించి కథతో.. ఓ సినిమా తీయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు కేథరిన్, బ్రూస్ కెమెరాన్ అనే హాలీవుడ్ రచయితలు. కథ సిద్ధమైనా.. అందుకు సరిపడా కుక్క దొరకకపోవడంతో వెతకడం ప్రారంభించారు. కరెక్టుగా అదే టైమ్‌లో షెల్బై వాళ్ల కంటపడింది. దాంతో షెల్బైను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సినిమా తీయాలని డిసైడయ్యారు.

సినిమాకు అవసరమైనట్టుగా షెల్బైని శిక్షకుల సాయంతో తీర్చిదిద్దారు.అనంతరం ‘‘ ఎ డాగ్స్ వే హోమ్’’ టైటిల్‌తో సినిమాను రూపొందించారు. సినిమాలో షెల్బై పాత్ర పేరు బెల్లా. గత నెలలోనే రిలీజైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. బెల్లా పాత్రలో షెల్బై నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలా ఒక్క సినిమాతో ఈ శునకం స్టార్‌గా మారిపోయింది. ఇప్పుడు హాలీవుడ్‌లో ఈ శునకరాజం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
First published: February 18, 2019, 2:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading