హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

‘ఎలుక మిస్ అయ్యిందంటూ ఫిర్యాదు..’ కిడ్నాప్ ఎవరు చేశారో కూడా చెప్పిన బాధితుడు.. అసలేం జరిగిందంటే..

‘ఎలుక మిస్ అయ్యిందంటూ ఫిర్యాదు..’ కిడ్నాప్ ఎవరు చేశారో కూడా చెప్పిన బాధితుడు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: మనం బంగారం, డబ్బులు పొగొట్టుకున్న సందర్భాలలో పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటాం. కానీ ఇక్కడో వ్యక్తి తన పెంపుడు ఎలుక కన్పించడం లేదని ఠాణాకు వెళ్లాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

మనలో చాలా మంది కాస్లీ వస్తువులు, బంగారం వేసుకొవడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. కొన్నిసార్లు అనుకొని సందర్భాలలో చోరీలకు గురౌతుంటాయి. ఇలాంటి పరిస్థితులలో బాధితులు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. అదే విధంగా.. మరికొందరు మంచి బ్రీడ్ కు చెందిన.. కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. అయితే.. వీటిని కూడా కొందరు దొంగతనం చేస్తుంటారు. దీంతో యజమానులు పేపర్ లో, గోడపై పోస్టర్ లు వేయిస్తుంటారు.

మరికొందరైతే.. పోలీసులకు ఫిర్యాదు చేయడం,పెంపుడు జంతువులను తీసుకొచ్చి ఇస్తే బహుమానం కూడా ప్రకటిస్తుంటారు. కొందరు కొళ్లను, మేకలు, ఆవులు, గేదెలను దొంగలిస్తుంటారు. అయితే... వీరి యజమానులకు మూగజీవాలతో అటాచ్ మెంట్ ఉంటుంది. ఒక్క నిముషం తమ పెంపుడు జంతువు కన్పించకపోయిన విలవిల్లాడిపోతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan) వింత ఘటన చోటు చేసుకుంది. సజ్జన్ గఢ్ ప్రాంతంలోని పడ్లా వాడ్కియా గ్రామంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. అతను కొన్నేళ్లుగా ఒక ఎలుకను (Rat) ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు. దానికి మంచి ఫుడ్ పెట్టేవాడు. ఎక్కడికి వెళ్లిన దాన్ని ఒక కంట కనిపెట్టుకుని ఉండేవాడు. అయితే.. ఒకరోజు అతని పెంపుడు ఎలుక కన్పించకుండా పోయింది. ఇంట్లో చుట్టుపక్కల వెతికాడు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో అతగాడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన ఎలుక కన్పించడంలేదని ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా చెప్పాడు. ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని కూడా చెప్పాడు.

అంతే కాకుండా.. ఎలుక మిస్పింగ్ వెనుక తన సోదరుల పిల్లల హస్తం ఉండోచ్చని కూడా ఫిర్యాదు చేశాడు. తొలుత పోలీసులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాధితుడు మంకుపట్టు పట్టేసరికి ఫిర్యాదు నమోదు చేశారు. అంతే కాకుండా.. ఎలుకను తన సోదరుడి కుమారులు ఏమైన చేశారేమో అని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో వారి సోదరుడి కుమారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌ కాపీలో నమోదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి కేసు నమోదు చేయడం తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Rajasthan, VIRAL NEWS

ఉత్తమ కథలు