ఇదో రౌడీ కోడి.. దీని మీద కోర్టులో పెద్ద కేసు..

ఆ కోడి అరుపులను కట్టడి చేయడానికి దాని యజమాని కూడా కొన్ని ప్రయత్నాలు చేశారట. రాత్రి పూట కోడి గుడ్లు పెట్టే బాక్సులను దాని గంప చుట్టూ పెడుతున్నారట.

news18-telugu
Updated: July 7, 2019, 8:25 PM IST
ఇదో రౌడీ కోడి.. దీని మీద కోర్టులో పెద్ద కేసు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇది ఓ రౌడీ కోడి కధ. దీని మీద కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఫ్రాన్స్ సమీపంలోని ఓలెరాన్ అనే ద్వీపంలో ఈ కోడి ఉంది. ఇది ఊరి కంటే ముందే నిద్ర లోచి.. ‘కొక్కొరొకో... కొక్కొరొకో..’ అంటూ తెగ గోల చేస్తుందట. అయితే, మంచిదే కదా అంటారా? అయితే, ఆ చుట్టుపక్కల వారు దాని కొక్కొరొకో గోల భరించలేకపోయారు. ఏదో కొన్ని రోజులు ఉంటుందిలే అనుకున్నారు. కానీ, అది సినిమాల్లో చూపించినట్టు మరింత పెద్దగా అరుస్తుండడంతో చుట్టుపక్కల వారికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఇరుగుపొరుగు వారు ఆ రౌడీ కోడి మీద కేసు పెట్టారు. ఈ వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్లింది. పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుని.. హాయిగా విశ్రాంత జీవితాన్ని అనుభవిద్దామని.. మేం ద్వీపానికి వస్తే.. ఇక్కడ ఈ కోడి తమను బతకనివ్వడం లేదంటూ ఓ వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ కోడి అరుపులను కట్టడి చేయడానికి దాని యజమాని కూడా కొన్ని ప్రయత్నాలు చేశారట. రాత్రి పూట కోడి గుడ్లు పెట్టే బాక్సులను దాని గంప చుట్టూ పెడుతున్నారట. ఆ రకంగా అయినా.. ధ్వని బయటకు వెళ్లకుండా ఉంటుందని భావించారు. కానీ, అవేవీ పనిచేయలేదు. అయితే, ఆ చుట్టుపక్కల 40 మంది ఉన్నారని.. వారు సర్దుకుపోతున్నారని.. కేవలం ఈ కొత్తగా వచ్చిన వృద్ధ జంటే ఫిర్యాదు చేసిందని కోడి యజమాని కోర్టుకు తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 7, 2019, 8:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading