కట్లపామును పీక్కుతున్న ఉడత... డేర్ డెవిల్ ఉడతకు నెటిజన్స్ ఫిదా...

అమెరికాలోని టెక్సాస్ సిటీలో ఉన్న గ్వాడలుపే మౌంటైన్స్ నేషనల్ పార్క్‌లో విచిత్ర సంఘటన... ఆహారాన్ని వెతుకుతూ గుహ దగ్గరికి వచ్చిన పామును పీక్కుతున్న ఉడత... సోషల్ మీడియాలో వీడియో వైరల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 25, 2019, 4:06 PM IST
కట్లపామును పీక్కుతున్న ఉడత... డేర్ డెవిల్ ఉడతకు నెటిజన్స్ ఫిదా...
పామును పీక్కుతున్న ఉడత... వీడియో వైరల్...
  • Share this:
‘ఉడతా ఉడతా ఊచ్... ఎక్కడికెళతావోచ్’ అంటూ పాటలు పాడుతూ చిన్నప్పుడు ఆడుకునేవాళ్లం. నేటితరం పిల్లలకు ఈ పాటల గురించి పెద్దగా తెలియకపోయినా, ఉడతలంటే ఎందుకో తెలియని మక్కువ మాత్రం ఉంది. ఉడతలు పరమ పిరికి జంతువులు. చిన్న అలికిడి అయితే చాలు... భయంతో గుహలోకి పరుగులు పెడతాయి ఉడతలు. అలాంటి ఉడతల్లో దాగి ఉన్న మరో కోణాన్ని చూపించే సంఘటన ఇది. పాములకు, ముంగిసలకు జాతి వైరం ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు ఎదురుపడితే చాలు... కయ్యానికి దిగుతాయి. పాము- ముంగిసల సయ్యాటలను చూసేందుకు జనం ఎగబడతారు కూడా. ముంగిస జాతికి చెందిన ఉడతలకు సర్పాలకు కూడా జాతి వైరం ఉంటుంది. చిన్నచిన్న ఎలుకలు, ఉడతలను తింటాయి కొన్ని రకాల పాములు. సాధారణంగా అయితే పాము కనిపిస్తే ఉడతలు ఆ దారి నుంచి తప్పించుకుని పారిపోతాయి. అయితే ఆహారం కోసం వెతుకుతూ తన గుహ దగ్గరికి వచ్చిన సర్పానికి ఎదురెళ్లిందో ఉడత. దానితో సయ్యాటకు దిగింది. పాముతో చాలాసేపు పోరాడిన ఉడత.. దాని తలకొరికి చంపేసింది. చచ్చిన పామును పడేయకుండా సుష్టుగా ఆరగించింది. ఆరడుగుల పామును మొత్తం భుజించేసి... కేవలం రెండు అంగుళాల తోక మాత్రం మిగిల్చి తాపీగా వెళ్లిపోయింది. అక్కడే ఉన్న వైల్డ్ లైఫ్ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి.

అమెరికాలోని టెక్సాస్ సిటీలో ఉన్న గ్వాడలుపే మౌంటైన్స్ నేషనల్ పార్క్ (Guadalupe Mountains National Park)లో జరిగిందీ విచిత్ర సంఘటన. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వైల్డ్‌ ఉడత ఫోటోలను షేర్ చేస్తూ, ఆపద సమయంలో పారిపోవడం కాదు, పోరాడి శత్రువును చంపేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

First published: May 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading