Video: వామ్మో.. స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌పై పడిన కొండరాళ్లు... ఇరుక్కుపోయిన బోగీలు

రైలుపై పడిన కొండరాళ్లు (image credit - twitter)

Viral Video: ఆ రైల్లో ప్రయాణిస్తున్న వారు... చుట్టూ కొండలు, పచ్చటి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అడవి లోంచీ ట్రైన్ వెళ్తుండగా జరిగిన దారుణం... అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో చూస్తే మీరూ ఫీలవుతారు.

  • Share this:
    Viral Video: మహారాష్ట్రలో జోరు వానలు, వరదలకు తోడు... చాలాచోట్ల కొండరాళ్లు విరిగి పడటంతో... వందల మంది చనిపోయిన విషయం మనకు తెలుసు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జల ప్రళయం కనిపించింది. కర్ణాటకలోని మంగళూరు నుంచి మహారాష్ట్రలోని ముంబైకి వెళ్లాల్సిన ఓ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ మధ్యలో కొంతసేపు చిక్కుకుపోయింది. గోవాలో శుక్రవారం ఆ రైలు వెళ్తుండగా... జోరు వాన కురిసింది. కొండపై నుంచి భారీగా రాళ్లు, మట్టి సరిగ్గా రైలుపై పడ్డాయి. దాంతో ఆ బురదలో ఇరుక్కుపోయింది. అప్పటికే వానకారణంగా ప్రయాణికులు అలర్టుగా ఉన్నారు. రైలు పట్టాలు తప్పితే... బయటకు ఎలా దూకాలి అని ఆలోచించుకుంటున్నారు. అదే నిజమైంది.

    ట్రైన్ నంబర్ 01134. మంగళూరు జంక్షన్ - CST టెర్మినస్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్. ఇది వెళ్లే రూట్ వేరే. అయితే... వశిష్ట నదిలో నీటి మట్టం పెరిగిపోవడంతో... దీన్ని దారి మళ్లించారు. మడ్గావ్ - లొండా - మిరాజ్ మార్గంలో పంపించారు. దూద్ సాగర్ - సోనోలిమ్ సెక్షన్‌లో రైలు ఇంజిన్, మొదటి జనరల్ కోచ్... పట్టాలు తప్పాయి. లక్కీగా ప్రయాణిలకు ఎలాంటి గాయాలూ కాలేదు. పట్టాలు తప్పిన బోగీలోని ప్రయాణికులను ఇతర బోగీల్లోకి పంపారు. ఆ తర్వాత అన్నీ సెట్ చేసి... మళ్లీ రైలును ముందుకు నడిపించారు.

    రైలుపై కొండ రాళ్లు పడిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.


    ఇది కూడా చదవండి: Video: 2 తలల పాము... ఒకేసారి 2 ఎలుకల్ని మింగేసింది... ఎలా?

    భారీ వర్షాల వల్ల సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో... హుబల్ మండలంలోని ఘాట్ సెక్షన్‌లో రెండు చోట్ల ఇలా కొండరాళ్లు పడినట్లు తెలిసింది. మొదటి ఘటన దూద్ సాగర్ - సోనోలిమ్ స్టేషన్ల దగ్గర జరగ్గా... రెండోది కరంజోల్ - దూద్ సాగర్ స్టేషన్ల మధ్య జరిగింది.
    Published by:Krishna Kumar N
    First published: