Home /News /trending /

A SOCIAL WORKER FROM DEHRADUN HAS DECIDED TO ADOPT 100 CHILDREN WHO HAVE BEEN ORPHANED DURING THE PANDEMIC SSR GH

మనసున్న మారాజు.. ఇతను చేసిన పనేంటో తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు..

చిన్నారులతో ఎన్​జీవో జాయ్

చిన్నారులతో ఎన్​జీవో జాయ్

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. అయితే ఇలాంటి వారి కోసం ఓ సామాజిక కార్యకర్త ముందుకు వచ్చారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన 100 మంది చిన్నారులను దత్తత తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు.

కరోనా వైరస్​ లక్షల మంది ప్రాణాలను తీసింది. అనేక కుటుంబాలను అల్లకల్లోలం చేసింది. జీవితాలను తారుమారు చేసింది. ముఖ్యంగా కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. లోకం తెలియని వారు కన్నవారు లేకపోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇలా కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. అయితే ఇలాంటి వారి కోసం ఓ సామాజిక కార్యకర్త ముందుకు వచ్చారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన 100 మంది చిన్నారులను దత్తత తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. డెహ్రాడూన్​కు చెందిన ఆ సామాజిక కార్యకర్త పేరు జై శర్మ. ఆయనకు చెందిన జాయ్​ (జస్ట్ ఓపెన్ యువర్ సెల్ఫ్​) అనే స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే 20 మంది దత్తత తీసుకోగా.. త్వరలోనే మరో 80 మంది అనాథలను చేరదీయనుంది. ఈ విషయాన్ని ఆ ఎన్​జీవో ఫేస్​బుక్​ ఖాతాలో పోస్ట్ చేశారు.

“కరోనా రెండో వేర్​ ప్రారంభమైన రెండు వారాలకే.. వైరస్ వల్ల తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలున్న ఐదు కుటుంబాలను గుర్తించాం. కన్నవారు లేక ఆ పిల్లలు ఒంటరివారయ్యారు. ఇందులో 4, 5వ తరగతి పిల్లలకు కూడా ఉన్నారు. ఒకరు 12వ తరగతి కాగా.. మిగిలిన వారంతా చిన్న వయసు వారే. ఆ సమయంలో వారి పరిస్థితి చూసి చాలా బాధేసింది. ఇప్పటికి 20 మంది పిల్లలను చేరదీశాం. వారికి ఆహారం, వసతి, వైద్యం, ఆర్థిక సదుపాయాలతో అన్ని చూసుకుంటున్నాం. ఆ పిల్లల్లో ఇద్దరు డెహ్రాడూన్ వారు కాగా.. మిగిలిన వారు వేరే ప్రాంతాల వారు. వారంలోగా 50 మందికి పిల్లలను తీసుకొస్తాం. మొత్తంగా ప్రస్తుతానికైతే 100 మంది పిల్లలను చేరదీయాలని నిర్ణయించాం. జాయ్​ నుంచి నేను జై శర్మ.. పిల్లలకు సాధ్యమైనంత సాయం చేసేందుకు నేనున్నా” జస్ట్​ ఓపెన్ యువర్​సెల్ఫ్ ఫేస్​బుక్ పేజీలో జై శర్మ పోస్ట్ చేశారు. పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.

జాయ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నిత్యం కొన్ని గ్రామాలకు వెళుతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు ఉంటే సాయం చేసేందుకు సమాచారం సేకరిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు జాయ్ ఎన్​జీవో ఫౌండర్ జై శర్మ ముందు నుంచి కృషి చేస్తున్నారు. ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఆక్సిజన్​ను సైతం ఎన్జీవో తరఫున అందించారు. అలాగే ఎన్జీవో బృందాలు.. కొవిడ్ మెడికల్ కిట్లు, శానిటైజేషన్ కిట్లు, అవసరమైన వారికి వైద్య సాయం చేశాయి. ఈ విషయాలన్నింటినీ జై శర్మ ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Corona

తదుపరి వార్తలు