ఏసీ నుంచి బుస్ బుస్ శబ్దాలు.. తెరిచి చూడగా భారీ షాక్..

బెడ్‌రూంలోకి వెళ్లగానే ఏసీ నుంచి బుస్ బుస్ అంటూ శబ్దాలు రావడంతో తొలుత అది పాడైందేమోనని భావించిన యజమాని.. ఆన్ చేసి చూస్తే చక్కగా, చల్లగా గాలి వచ్చింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 14, 2019, 10:59 AM IST
ఏసీ నుంచి బుస్ బుస్ శబ్దాలు.. తెరిచి చూడగా భారీ షాక్..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 14, 2019, 10:59 AM IST
ఏసీలో పాము తలదాచుకున్న సంఘటన తాజాగా పుదుచ్చేరిలో వెలుగు చూసింది. బెడ్‌రూంలోకి వెళ్లగానే ఏసీ నుంచి బుస్ బుస్ అంటూ శబ్దాలు రావడంతో తొలుత అది పాడైందేమోనని భావించిన యజమాని.. ఆన్ చేసి చూస్తే చక్కగా, చల్లగా గాలి వచ్చింది. ఏమై ఉంటుందోనని అలాగే ఉండిపోయాడు. శబ్దాలు రోజు రోజుకు ఎక్కువ కావడంతో మెకానిక్‌ను పిలిపించగా అందులో పాము కనిపించింది. దీంతో మెకానిక్ సహా ఇంట్లో వాళ్లంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. పుదుచ్చేరిలోని తెంగాయితిట్టు సాయి జీవా సరోజానగర్‌కు చెందిన ఏలుమలై ఇంట్లోని పడకగదిలో మూడు నెలలుగా ఏసీ యంత్రంలో పాము దాగి ఉంది. దాన్నుంచి తరచూ శబ్దం వస్తోంది. దీంతో ఆయన మెకానిక్‌ను రప్పించారు. యంత్రాన్ని విప్పి చూస్తున్నప్పుడు రెండు పాము కుబుసాలు కనిపించాయి.

జాగ్రత్తగా పరిశీలించగా అందులో ఓ పాము ఉన్నట్లు గుర్తించారు. ఏలుమలై వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు రెండు గంటలపాటు శ్రమించి దానిని బయటకు తీశారు. అది రెండడుగుల పొడవు ఉంది. యంత్రానికి ఉన్న బయటి పైపును సరిగ్గా మూయకపోవడంతో పాము లోనికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. పామును అడవిలో వదిలేశారు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...