Destiny Play: ఓ పాము.. ఓ ఎలుక.. ఓ బాలుడు.. ఇది నిజంగా విధి ఆడిన వింత నాటకమే

కిరాణ షాపులో బాలుడు. ఇన్​సెట్​లో పాము

ఓ ప్రముఖ వ్యక్తి దేవుడి గురించి చేసిన వ్యాఖ్యలు నిజమనుకోక తప్పదు. ఎందుకంటే ఆయన ఒక వీడియో (Video)ను పోస్టు చేస్తూ మరీ చెప్పాడు. ఇక ఆ వీడియోని చూస్తే మాత్రం హేతువాదులు కూడా ఔరా అనుకోవాలి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా.. ఓ పాము (Snake).. ఓ ఎలుక (Rat).. ఓ బాలుడు (Boy).. విధి ఆడిన వింత నాటకమూ ఏమో కానీ, మృత్యువు ఎటు నుంచి ఎటు షిప్టు (shift) అయిపోయిందనేది తెలియజేస్తుంది.

  • Share this:
    మృత్యువు (death) ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో తెలియదు. అయితే కొద్దిమంది మాత్రమే మృత్యువు కోరల్లోంచి చాకచక్యంగా బయట పడుతారు. మరికొందరు అదృష్టం (Lucky) కలిసొచ్చి బతికిపోతారు. ఇలాంటి వారినే మృత్యుంజయులు (Mortals) అంటారు. ఇక దేవుడి గురించి చెప్పాలంటే ఆయనను కొలిచే భక్తజనం ఉన్నాడంటారు. హేతువాదులు మాత్రం అంతా అబద్దం అని తీసిపడేస్తారు. అసలు వారు దేవుడు ఉన్నాడంటేనే పిచ్చివాళ్లలాగా (Mental candidates) చూస్తారు. అయితే ఇక్కడ ఓ ప్రముఖ వ్యక్తి దేవుడి గురించి చేసిన వ్యాఖ్యలు నిజమనుకోక తప్పదు. ఎందుకంటే ఆయన ఒక వీడియో (Video)ను పోస్టు చేస్తూ మరీ చెప్పాడు. ఇక ఆ వీడియోని చూస్తే మాత్రం హేతువాదులు కూడా ఔరా అనుకోవాలి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా.. ఓ పాము (Snake).. ఓ ఎలుక (Rat).. ఓ బాలుడు (Boy).. విధి ఆడిన వింత నాటకమూ ఏమో కానీ, మృత్యువు ఎటు నుంచి ఎటు షిప్టు (shift) అయిపోయిందనేది తెలియజేస్తుంది.

    సెకన్ల వ్యవధిలోనే తప్పించుకున్న బాలుడు..

    ఒక్కో సారి మన కళ్ల ముందు జరిగే కొన్ని సంఘటనలు చూసి కూడా మనం నమ్మలేం. అంతే కాదు వాటి నుంచి తేరుకోవడానికి మనకు నిజంగా కొంచెం సమయం కూడా పడుతుంది అని చెప్పాలి. అలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో చోటు చేసుకుంది.. ఒక భయంకరమైన కోబ్రా కాటు నుంచి ఒక బాలుడు తప్పించుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ఒక బాలుడు వాళ్ల కిరాణంలో తన స్మార్ట్ ఫోన్ (Phone) తీసుకొని కాలక్షేపం చేస్తూ ఉన్నాడు.. అయితే అక్కడ ఉన్న టేబుల్ (table) మీద కాస్త నడుము వాల్చాలని  అనుకున్నాడు.  ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా హుటాహుటిన లేచి బయటకి పరిగెత్తాడు(Run away).

    బాలుడు లేచిన సెకండ్ల వ్యవధిలోనే ఒక ఎలుక (rat) కిరాణ అంగడి సందులో నుంచి బయటకు రావడం, దాని వెనకాల (back) ఒక నాగుపాము (Snake) రావడం వీడియోలో గమనించవచ్చు. ఇక ఎలుకను వేటాడుతూ (Hunting) వచ్చిన ఆ పాము.. ఒకవేళ బాలుడు అక్కడే ఉన్నట్లయితే కచ్చితంగా ఆ పాము కాటుకు (snake bite) గురి అవ్వాల్సి వచ్చేది.. ఇక ఈ పాము, ఎలుకల గొడవలో ఆ బాలుడు తృటిలో ప్రాణాలను (life) దక్కించుకున్నాడు.. ఇక భగవంతుడే ఆ బాలుడిని కాపాడాడు అని పలువురు చెబుతున్నారు..



    ఇకపోతే ఈ సీసీటీవీ ఫుటేజ్ ను భారత జనతా పార్టీ (BJP) నేత అయిన హితానంద శర్మ (Hitanand Sharma) ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఇది కాస్తా వైరల్ (viral) గా మారింది. అంతేకాదు ఆయన ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. కింద దేవుడు (God) రక్షించాలని అనుకుంటే ప్రాణానికి ఏ ప్రమాదం వాటిల్లదు అంటూ కామెంట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అదృష్టవంతులను (Lucky fellows) ఎవరూ ఏమీ చేయలేరు అంటూ నెటిజన్లు (netizens) కామెంట్లు చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి:
    Published by:Prabhakar Vaddi
    First published: