బీర్లకు కూడా కరువొచ్చె.. తాగుదామంటే అవి కూడా దొరకడం లేదు..

వైన్ షాపు దగ్గరికి వెళ్తే చాలు.. ‘బీర్లు లేవు’ అన్న బోర్డు దర్శనమిస్తోంది. డిమాండ్‌కు తగ్గ బీరు ఉత్పత్తి లేకపోవడంతో తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.

Bommakanti Shravan | news18-telugu
Updated: May 31, 2019, 6:56 AM IST
బీర్లకు కూడా కరువొచ్చె.. తాగుదామంటే అవి కూడా దొరకడం లేదు..
ప్రతీకాత్మక చిత్రం
Bommakanti Shravan | news18-telugu
Updated: May 31, 2019, 6:56 AM IST
భానుడి ప్రతాపానికి భూమిలోని నీళ్లన్నీ ఇంకిపోతున్నాయి. చుక్క నీరు దొరకితే మహా ప్రసాదం అనుకోవాల్సి వస్తోంది. నీళ్లే కాదు.. ఎండకు కాస్త కూల్ అవుదామనుకుంటున్న మందుప్రియులకు కూడా కష్టమొచ్చిపడింది. భూమిలో నీళ్లు ఇంకినట్లు.. వైన్ షాపుల్లో బీర్లు ఉండటం లేదు. వైన్ షాపు దగ్గరికి వెళ్తే చాలు.. ‘బీర్లు లేవు’ అన్న బోర్డు దర్శనమిస్తోంది. డిమాండ్‌కు తగ్గ బీరు ఉత్పత్తి లేకపోవడంతో తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. బీరు ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత లేకపోవడమే ఇందుకు కారణం. సంగారెడ్డి సమీపంలోని ఐదు బ్రూవరీలు మాత్రమే బీరును ఉత్పత్తి చేస్తున్నాయి. బీరు ఉత్పత్తికి అవసరమైన నీటిని సింగూరు జలాశయం నుంచి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కానీ, తాగునీటి అవసరాల దృష్ట్యా బ్రూవరీలకు నీటి సరఫరాను మే 1 నుంచి నిలిపివేసింది. దాంతో ఉత్పత్తిదారులు సొంత బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకొని బీరును ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రతిరోజూ 2.50 లక్షల కేసుల బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రస్తుతం 1.5 లక్షల కేసులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ బీరునే బేవరేజెస్‌ కార్పొరేషన్‌ తన డిపోల ద్వారా అన్ని వైన్‌ షాపులు, బార్లకు సరఫరా చేస్తోంది.

ఇప్పటి వరకు ఒక్కో వైన్‌ షాపునకు 100 కేసుల వరకు సరఫరా చేసేది. ఇప్పుడు ప్రతి షాపునకు 25-30 కేసులను మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో బీరుకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఈ నెల 30వ తేదీ వరకు మొత్తం 56.88 లక్షల కేసుల బీరును మాత్రమే షాపులకు సరఫరా చేసింది. అదే గత సంవత్సరం మే 30వ తేదీ వరకు 56.76 కేసులను సరఫరా చేసింది. వాస్తవానికి ఈ నెలలో 65-70 లక్షల కేసులకు గిరాకీ ఉందని వైన్‌ షాపులవారు చెబుతున్నారు. బీర్ల కొరత ఉండడంతో షాపుల వద్ద బీరు లేదంటూ బోర్డులు పెడుతున్నారు. నల్లగొండ, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ఇలాంటి బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...