chennai : పాముతో సహాసం చేసిన కుర్రాడు.. చేసింది తెలిస్తే..అవాక్కే...!

chennai : పాముతో సహాసం చేసిన కుర్రాడు..

chennai : పాముతో ఓ ఏడేళ్ల కుర్రాడు పెద్ద సహాసమే చేశాడు..పెద్దవాళ్లే పామును చూస్తేనే.. ఆమడ దూరం పరుగెత్తుతారు..కాని ఏడేళ్ల బుడతడు మాత్రం తనను కరిచిన పామును వెంటాడి వేటాడి పట్టుకున్నాడు..అనంతరం దాన్ని చంపి ఇంటికి ఆసుపత్రికి తీసుకువెళ్లాడు..దీంతో అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులు ఆశ్చర్యపోయారు..

  • Share this:
    విషపు పురుగులు, పాములపై ఓ ఏడేళ్ల కుర్రాడు అత్యంత తెలివిగా వ్వవహరించాడు. సామాన్యులు పామును చూస్తేనే...పారిపోయో మనస్తత్వం ఉంటుంది..అలాంటీ ఆ బాలుడు మాత్రం ఏమాత్రం బయపడలేదు..పాములు కుడితే ఏం చేయాలనే దాన్ని వెంటనే అమలు చేశాడు. పాము కుట్టినప్పుడు అది ఎలాంటదని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగాంగానే తాను పొలం వద్ద ఆడుకుంటుంటే కుట్టిన పామును కోసం వెంటాడాడు. అది పోదల్లోకి పోయిన లాగి బయట వేశాడు..అనంతరం దాన్ని కర్రలతో కొట్టి చంపాడు.

    అంతే కాకుండా ఆ చచ్చిన పామును తీసుకుని ముందుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అయితే కంగారు పడిన తల్లిదండ్రులు పాముతోపాటు బాలున్ని తీసుకుని స్థానిక కాంచీపురం ఆసుపత్రికి వెళ్లారు.దీంతో బాలున్ని ఆసుపత్రిలో చికిత్స కోసం రెండు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో పెట్టారు. పాము కరిచిన భయం లేకపోవడంతో ఎలాంటీ మార్పులు చోటు చేసుకోకపోవడంతో వైద్యులు ఇంటికి పంపారు.

    కాని ఇంటికి వచ్చిన మరుసటి రోజు పాము కాటుకు బాలుడి కాలు వాచింది..దీంతో తిరిగి మరో ఆసుపత్రికి బాలున్ని తీసుకువెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. అయితే ట్విస్ట్ ఏటంటే కుట్టిన పామును చంపి ఎందుకు ఆసుపత్రికి తీసుకువచ్చావని అడిగిన వైద్యులకు ఆ బాలుడు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. తానను కరిచిన పాము తెలియకుండా ఎలా చికిత్స అందిస్తారని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

    కాగా ఈ సంఘటన తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టకు చెందిన దర్షిత్‌ అనే మూడో తరగతి చదువుతున్న బాలుడు, ఈనెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని తమ పొలం వద్దకు వెళ్లి ఆడుకుంటుండగా పాము కరిచింది.
    Published by:yveerash yveerash
    First published: