ఈ ప్రపంచంలో ఫ్రీగా పెట్రోల్, డీజిల్ వంటివి ఇస్తామంటే... ఆల్రెడీ ఉన్న ఫ్యూయల్ కూడా వాడేసి మరీ వెళ్లి క్యూలో నిలబడతారు చాలా మంది. ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఇది వర్తిస్తుంది. డబ్బు తీసుకోకుండా... పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇచ్చేందుకు ఏ దేశ ప్రభుత్వమూ ముందుకు రాదు. ఐతే... రష్యా... సమారాలోని... ఓల్వీ గ్యాస్ స్టేషన్ మాత్రం బంపరాఫర్ ప్రకటించింది. చిత్రమైన మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా... బికినీలో వచ్చేవారికి ఫ్రీగా పెట్రోల్ పోస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌తో... పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం... అమ్మాయిలంతా బికినీల్లో వచ్చేస్తారనీ... పండగ చేసుకోవచ్చని అనుకుంది ఆ బంక్ యాజమాన్యం. సిబ్బంది కూడా... అందాల్ని ఆస్వాదించాలని ఆశగా ఎదురుచూశారు. కానీ... ఊహించని షాక్ తగిలింది.
ఈ ఆఫర్ అమ్మాయిలకా, అబ్బాయిలకా అన్నది ఆ బంక్ చెప్పలేదు. అందువల్ల ఎవరు బికినీలో వచ్చినా... ఫ్రీగా పొయ్యాల్సిందే. షాకింగ్ విషయమేంటంటే... అమ్మాయిలెవరూ ఆ బంకుకి బికినీలతో రాలేదు. అబ్బాయిలు మాత్రం... హడావుడిగా బికినీ డ్రెస్సులు కొనుక్కొని మరీ... బంకుకు రావడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు వస్తూ... "వాచ్ మి... ఐ యామ్ ఇన్ బికినీ" అంటూ కారు దిగుతున్నారు. వాళ్లను చూడలేక బంక్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. చిత్రమేంటంటే... కొందరు మగాళ్లైతే... బికినీకి సెట్ అయ్యే కలర్ హైహీల్స్ కొనుక్కొని... వాటిని కూడా చూపిస్తున్నారు.
ఇప్పుడీ బికినీ ఫొటోలు... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై షాకైన బంక్ యజమాని... తను ఇచ్చిన ఆఫర్ టైమ్ తగ్గించి... 3 గంటల వరకే అని కుదించాడు. ఈ విషయం తెలియని చాలా మంది ఆఫర్ అయిపోయినా... బికినీల్లోనే బంకుకు వచ్చి... నిరాశతో వెనుదిరిగారు. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ తెచ్చిన ఈ ఆఫర్‌పై జనం మండిపడుతున్నారు. ఐతే... ఈ మగాళ్ల బికినీ ఫొటోలు మాత్రం నెట్లో వైరల్ అవుతూ... అందరూ నవ్వుకునేలా చేస్తున్నాయి.
బుల్లి తెరే బెటరంటున్న పల్లవీ గౌడ
ఇవి కూడా చదవండి :
గన్ ఫైరింగ్‌లో నలుగురు మృతి... ఎవరు? ఎందుకు?
జబర్దస్త్ రష్మీ రిక్వెస్ట్... ఆ రెండున్నర గంటలూ...
భర్తకు విషం ఇచ్చిన భార్య... పెళ్లైన వారానికే...
షానా చౌహాన్... సక్సెస్‌కి చిరునామా...
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణస్వీకారం...
Published by:Krishna Kumar N
First published:November 18, 2019, 14:32 IST