A RUSSIAN FILM CREW ARE BACK ON EARTH AFTER WRAPPING UP SCENES FOR THE FIRST MOVIE SHOT IN SPACE GH SSR
First Shooting in Space: అంతరిక్షంలో మొదటి సినిమా షూటింగ్ సక్సెస్.. క్షేమంగా తిరిగి భూమికి చేరుకున్న చిత్ర యూనిట్
భూమికి చేరుకున్న చిత్ర యూనిట్
సినిమా షూటింగ్ అనేక లోకేషన్లలో చేస్తూ ఉంటారు. ఒక్కోసారి సముద్రం లోపల, మంచు పర్వతార్వాల శిఖరాలపైన కూడా షూటింగ్ చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. కానీ మొదటి సారిగా రష్యా నటి యులియా పెరెసిల్డ్ తో పాటు చిత్ర డైరెక్టర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 12 రోజులు సినిమా షూటింగ్ లో పాల్గొని ఆదివారం క్షేమంగా తిరిగి భూమికి చేరుకుని వార్తల్లో నిలిచారు.
సినిమా షూటింగ్ అనేక లోకేషన్లలో చేస్తూ ఉంటారు. ఒక్కోసారి సముద్రం లోపల, మంచు పర్వతార్వాల శిఖరాలపైన కూడా షూటింగ్ చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. కానీ మొదటి సారిగా రష్యా నటి యులియా పెరెసిల్డ్ తో పాటు చిత్ర డైరెక్టర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 12 రోజులు సినిమా షూటింగ్ లో పాల్గొని ఆదివారం క్షేమంగా తిరిగి భూమికి చేరుకుని వార్తల్లో నిలిచారు.
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అంటే ఆదివారం గం.4.36 నిమిషాలకు యులియా (37), క్లిమ్ షిపెన్ కో (38), కజికిస్థాన్ లోని స్టెప్పీలో క్షేమంగా దిగినట్టు రష్యాకు చెందిన రాస్కోస్మోస్ స్పేస్ ఏజెన్సీ ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియో ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. కాగా, స్పేస్ క్యాప్స్యూల్ నుంచి బయటకు వచ్చిన షిపెన్ కో కొంచెం ఒత్తిడికి గురైనట్టు కనిపించారు. వైద్యులు అతన్ని పరీక్షల నిమిత్తం తరలించేటప్పుడు మాత్రం కెమెరాలకు చేతులూపుతూ కనిపించారు.
ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్నపెరెసిల్డ్ ను, 3000 దరఖాస్తుదారుల నుంచి వడబోసి ఎంపిక చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో షూటింగ్ జరపుకుని, అక్కడి నుంచి వెళ్లిరావడం చాలా బాధగా ఉందని నటి యులియా అన్నారు.
A Russian trio said farewell to the station crew and closed the Soyuz MS-18 crew ship hatch at 4:41pm ET today. They undock at 9:14pm this evening. More... https://t.co/Hwwr4AEUI7pic.twitter.com/aXFOtG2H1O
అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు షూటింగ్ అనగానే ముందు చాలా ఎక్కువ రోజులు అనిపించింది, షూటింగ్ అయిపోయాక ఇక్కడ నుంచి వెళ్లాల్సి రావడం బాధాకరంగా ఉందని ఆమె ఓ ఛానల్ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చారు.
క్షేమంగా భూమిపైకి చేరుకున్న డైరెక్టర్, హీరోయిన్
21వ శతాబ్దంలో అంతరిక్ష పోటీపై నిర్మిస్తున్న ‘ది ఛాలెంజ్’ సినిమా షూటింగ్ కోసం అనుభవం కలిగిన ఆంటోన్ ష్కాప్లెరోవ్ తో కలసి కజికిస్థాన్ లోని బికనీర్ కాస్మోడ్రోమ్ నుంచి చిత్రబృందం ఈ నెల మొదట్లో బయలుదేరి వెళ్లింది. నాసా, ఎలోన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన మిషన్ ఇంపాజిబుల్ స్టార్టామ్ క్రూయిజ్ సహాయంతో ఈ హాలీవుడ్ ప్రాజెక్టును పూర్తి చేశామని ఈ చిత్ర బృందం చెబుతోంది. అయితే ఈ చిత్ర విశేషాలను, బడ్జెట్ ను మాత్రం గోప్యంగా ఉంచారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు అతిథి పాత్రలో నటించారని షకాప్లెరోవ్ తెలిపారు.
ఈ చిత్రం షూటింగ్ లో అనేక ఇబ్బందులు కూడా తలెత్తాయని షకాప్లెరోవ్ చెప్పారు. సోయుజ్ ఎంఎస్ 18 స్పేస్ క్రాఫ్ట్ ను పరిశీలించేప్పుడు ఊహించని విధంగా మంటలు వచ్చాయని, అరగంట సేపు ISSను ఆపివేయడం ద్వారా దాన్ని సరిచేశారని షకాప్లెరోవ్ వెల్లడించారు. ఈ చిత్ర బృందం ల్యాండింగ్ సన్నివేశాలు కూడా చిత్రంలో కనువిందు చేయనున్నాయి.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.