Home /News /trending /

A RITUAL LIKE NO OTHER THIS INDONESIAN TRIBE FORBIDS NEWLYWEDS FROM USING TOILET FOR THREE DAYS PAH

Viral news: ఇదేం రా అయ్యా.. కొత్త జంటకు మూడు రోజుల పాటు నో టాయ్ లెట్..

టిడాంగ్ తెగ  కొత్త జంట

టిడాంగ్ తెగ కొత్త జంట

Wedding Ritual: అక్కడ పెళ్లైన కొత్త జంట మూడు రోజుల పాటు ఒకే గదిలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోను గది దాటి బైటకు రావద్దు. టాయ్ లెట్ కు  కూడా వెళ్లకూడదు.

పెళ్లి వేడుకలు (Wedding) ఒక్కొచోట ఒక్కొ పద్ధతిలో జరుగుతుంటాయి. ఉత్తరాదిన కొన్ని ఆచారాలు ఉండే, మరికొన్ని చోట్ల వేరే ఆచారాలలో పెళ్లి వేడుకలు జరుగుతు ఉంటాయి. ఉత్తరాదిన పెళ్లి వేడుకలో వరుడు, గుర్రం మీద మండపానికి చేరుకుంటారు. కొన్ని పెళ్లిళ్లలో తుపాకిని గాలిలో పేలుస్తారు. కొన్ని చోట్ల కొత్త పెళ్లి కొడుకును గాడిదమీద ఉరేగిస్తుంటారు. మరికొన్ని చోట్ల వింతైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. అయితే, ఇవి ప్రధానంగా ఆయా తెగలు, కులాల మధ్యవెర్వేరుగా ఉంటాయి. ఇక్కడోక తెగలో వింత సంప్రదాయం ఇప్పటికి పాటిస్తున్నారు. ఇది కాస్త వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. సాధారణంగా పెళ్లి (Marriage) వేడుకలో కొందరు ఏవేవో సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఇండోనేషియాలోని (Indonesian tribe) టిడాంగ్ తెగ వారు కూడా ఒక విచిత్రమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లైన కొత్త జంటను గదిలోకి పంపిస్తారు. అక్కడ మూడు రోజుల పాటు (newly married couple) గదిలోనే ఉండాలి. గదిలో మరుగు దొడ్డి ఉండదు. బైటకు వచ్చి టాయ్ లెట్ ను ఉపయోగించుకొకూడదనే ఆచారాన్ని అక్కడి తెగ పాటిస్తుంటారు. ఇలా చేస్తేనే వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని వారు నమ్ముతుంటారు.

దీంతో వారి మధ్య ఏవిధంగా గొడవలు రావని, ఒకరిపై మరొకరికి విశ్వాసం బలపడుతుందని నమ్ముతారు. అయితే, ప్రస్తుతం కొత్తగా పెళ్లైన జంటను ఒకగదిలో పంపారు. వారికి తక్కువ మొత్తంలో ఆహరం,నీళ్లు ఉంచుతారు. వారి గదిలో మరుగుదొడ్డ నిర్మాణాలు మాత్రం ఉండవు.  మరీ వారు టాయ్ లేట్ లు (Toilets) ఉపయోగిస్తారో లేదా అన్నది ఇప్పటి వరకు సస్పెన్స్. దీనిపై అనేక కథనాలు వార్తలలో ఉన్నాయి. అయితే, తమ తెగ వారంతా ఈ ఆచారం పాటిస్తారని పలువురు భావిస్తారు. ఒక వేళ ఇది పాటించకపోతే వైవాహిక జీవితంలో ఊహించని కష్టాలు సంభవిస్తాయని నమ్ముతారు. ప్రస్తుతం  ఈ వార్త నెట్టింట్లో (Social media)  వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా మధ్య ప్రదేశ్ లో కాసేపట్లో పెళ్లి వేడుక పెట్టుకొని వరుడు మాయమయ్యాడు.

మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh)  భోపాల్ లో (Bhopal)  వింతఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బెతుల్ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ (Constable) సోను చల్తియాకు మే 22న ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్ళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వధువు తరపు వారు అరెంజ్ మెంట్స్ అంతా గ్రాండ్ గా చేశారు. అయితే, వరుడు (Groom escape) తరపు వారు ఎంత సేపటికి పెళ్లి మండపానికి రావడం లేదు. దీంతో కంగారు పడిపోయిన వధువు తరపువారు.. పలుమార్లు ఫోన్ చేశారు. అప్పుడు తమ కొడుకు కన్పించడం లేదని చెప్పారు.

దీంతో అమ్మాయి కుటుంబం వారు షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులకు కానిస్టేబుల్ సోను గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. సోను ఏడాది నుంచి మరో యువతితో ఎఫైర్ లో (love affair) ఉన్నాడని తెలిపారు. దీంతో యువతి షాక్ నకు గురైంది. అయితే, కానిస్టేబుల్ తీరుపట్ల యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులకు.. కానిస్టేబుల్ సోను పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Indonesia, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు