అరుదైన ఎగిరే పాము.. చూస్తే షాకవ్వాల్సిందే..

ఈ పాము ఓ చెట్టు నుంచి నేల మీదకు దూకి.. ఆ తర్వాత నేల మీద నుంచి ఇంటి తలుపైకి దూకింది. దీంతో ఈ పామును చూసిన ఆ ఇంట్లోని వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

news18-telugu
Updated: June 6, 2020, 7:55 PM IST
అరుదైన ఎగిరే పాము.. చూస్తే షాకవ్వాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది చూసేందుకు అన్ని సాధారణ పాముల్లాగే ఉంటుంది. కానీ అది గాలిలోకి అవలీలగా ఎగరేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే. ఇది నిజంగా ఎగిరే పాము. కర్ణాటకలోని మైసూరు నగరంలో తాజాగా ఈ పాము కన్పించింది. అయితే గతంలోనూ ఎగిరే పాము గురించి వార్తలు విన్పించాయి. కానీ ప్రస్తుతం మరోసారి మైసూరు నగరం అగ్రహారలోని రామనుజ రోడ్డులోని ఓ ఇంటి సమీపంలో ఈ అరుదైన పాము కన్పించింది. ఈ పాము ఓ చెట్టు నుంచి నేల మీదకు దూకి.. ఆ తర్వాత నేల మీద నుంచి ఇంటి తలుపైకి దూకింది. దీంతో ఈ పామును చూసిన ఆ ఇంట్లోని వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఆ పాము పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్లింది.

ఇలాంటి పాములు పస్విమఘట్ట అడవిలో ఎక్కువగా కన్పిస్తుంటాయి. అయితే ఈ పాములు విషపూరితం కావు. చిన్న మొక్కల నుంచి పొడవాటి చెట్లపైన సంచరిస్తుంటాయి. గతంలో మైసూరు పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి ఎగిరే పాము కన్పించింది. తాజాగా ఇప్పుడు మైసూరు నగరంలో కన్పించడం గమనార్హం.

అరుదైన పాము
Published by: Narsimha Badhini
First published: June 6, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading