Home /News /trending /

A RARE DISPLAY OF LOYALTY AND LOVE FOR THIER MASTER TWO DOGS FIGHT SNAKE FOR 2 HOURS TO SAVE OWNERS LIFE GH SRD

Loyal Dogs: యజమాని ప్రాణాలను కాపాడేందుకు పాముతో పోరాడిన శునకాలు.. చివరికి ఏమైందంటే..

Photo Credit : IANS

Photo Credit : IANS

Loyal Dogs: ఇంట్లోకి ఒక భారీ నల్లటి విషసర్పం ప్రవేశించింది. ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన కుక్కలు గట్టిగా మొరగడం ప్రారంభించాయి. కానీ పాము మాత్రం వెనుతిరిగి వెళ్లకుండా రాజన్ ఇంట్లోకి వెళ్లడానికి ముందుకు కదిలింది.

శునకాలు తమ యజమానుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతాయి. ప్రతి శునకం తమ యజమానులను రక్త సంబంధీకుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాయని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తాజాగా రెండు కుక్కలు తమ ఓనర్ ప్రాణాలను కాపాడేందుకు విషపూరితమైన పాముతో తలపడ్డాయి. యజమాని ప్రాణాలు కాపాడే తరుణంలో అవి తమ ప్రాణాలను త్యాగం చేశాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.వివరాల్లోకి వెళితే.. భడోహిలోని జైరాంపూర్ గ్రామంలో రాజన్ అనే ఓ వ్యక్తి షెరూ, కోకో అనే రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. అయితే ఆదివారం రోజు సాయంత్రం రాజన్ ఇంట్లోకి ఒక భారీ నల్లటి విషసర్పం ప్రవేశించింది. ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన కుక్కలు గట్టిగా మొరగడం ప్రారంభించాయి. కానీ పాము మాత్రం వెనుతిరిగి వెళ్లకుండా రాజన్ ఇంట్లోకి వెళ్లడానికి ముందుకు కదిలింది. ఇంట్లోకి వస్తే తమ యజమాని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందిన కుక్కలు వెంటనే దానిపై దాడి చేశాయి.

ఇది కూాడా చదవండి : ద్రావిడ్ కోసం పావులు కదుపుతున్న గంగూలీ.. హెడ్ కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్ బై..!

ఆ నల్లటి విష సర్పాన్ని ఇంట్లోకి ప్రవేశించకుండా దాదాపు రెండు గంటల సేపు పోరాడాయి. చివరికి ఆ విష సర్పాన్ని రెండు ముక్కలు చేసి చంపేశాయి. అయితే పాముపై షెరూ, కోకో చేసే దాడిని చూసి స్థానికులు హడలిపోయారు. విషపూరితమైన పాము నుంచి కుక్కల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అవి మాత్రం పామును చంపేంతవరకూ తమ దాడిని కొనసాగించాయి. ఈ సమయంలో ఆ విష సర్పం కుక్కలని చాలాసార్లు కాటు వేసింది. దీంతో పాముని చంపేసిన కొద్ది నిమిషాల్లోనే శునకాలు తమ ప్రాణాలను విడిచాయి.

ఈ హృదయ విదారక ఘటన గురించి తెలుసుకున్న యజమాని తల్లడిల్లి పోయాడు. తన శునకాలు చనిపోయాయన్న నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని రాజన్ మీడియాతో చెప్పాడు. తమను కాపాడేందుకే షెరూ, కోకో ప్రాణాలను అర్పించాయని చెబుతూ భావోద్వేగానికి గురైన రాజన్ వాటి త్యాగం తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు. కాగా సోమవారం రోజు షెరూ, కోకో భౌతికకాయలకు దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఈ కుక్క లకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం కాగా.. క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ శునకాల త్యాగాలను పొగుడుతూ నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Snake, Snake bite, Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు