A RAJASTHANI WOMAN WHO LEFT HER HUSBAND AND CHILD AND WENT TO PAKISTAN FOR A BOYFRIEND SNR
బాయ్‌ఫ్రెండ్ కోసం పాకిస్తాన్ బయల్దేరింది.. ఆ వివాహిత అంత పని చేసిందా..!
Photo Credit: Youtube
Ludo Love: లూడో గేమ్ ఆడుతూ యువకుడితో చాటింగ్ చేసింది. చాటింగ్ చేసిన వ్యక్తితో ప్రేమలో పడింది. అతడితోనే జీవితాన్ని గడిపేందుకు భర్త, బిడ్డను వదిలి ఏకంగా పాకిస్తాన్‌కు బయల్దేరింది. రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ ఇంత పని చేసింది.
రాజస్థాన్(Rajasthan)కి చెందిన ఓ లేడీ ఎంత పని చేసిందో తెలుసా. ఆటలో పరిచమైన వ్యక్తి కోసం దేశ సరిహద్దులు దాటి వెళ్లాలని చూసింది. ఇది ప్రేమో..పిచ్చో తెలియదు కానీ స్టోరీ వింటే మాత్రం ఖచ్చితంగా పిచ్చిప్రేమనే చెప్పాలనిపిస్తుంది. రాజస్థాన్(Rajasthan)లోని ధోల్పూర్(Dholpur)కి చెందిన శివానీ (Shivani)అనే మహిళ పాకిస్తాన్(Pakistan)వెళ్లాలనుకుంది. ఎందుకంటే ఆమె ఇష్టపడిన వ్యక్తి పాకిస్తాన్లో ఉండటంతో అతడితోనే జీవితాన్ని గడిపేందుకు పాకిస్తాన్‌కి ప్రయాణమైంది. అయితే ఆమె ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే శివానీ యువతి కాదు. వివాహిత. ఆమెకు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఆరు నెలల క్రితం శివానీకి లూడో గేమ్ (Ludo game)ఆడుతుండగా పాకిస్తాన్‌కి చెందిన అలీ (Ali) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. చాటింగ్ ద్వారా అలీ(Ali)ని శివానీ గాఢంగా ప్రేమించింది. కొద్ది రోజుల క్రితం అలీ ఆమెను అటారీ (Atari)సరిహద్దు (Border)వస్తే పాకిస్తాన్ (Pakistan)తీసుకెళ్తానని చెప్పాడు. దాంతో శివానీ అతడితోనే జీవితం గడపాలని నిర్ణయించుకుంది. అందుకోసం భర్త, బిడ్డను ధోల్పూర్(Dholpur)లో వదిలి అతడి దగ్గరకు బయల్దేరింది. జలియన్ వాలాబాగ్ (Jalian wala bhag)చేరుకోగానే అక్కడి నుంచి అటారీ వెళ్లేందుకు ప్రయత్నించింది. అమృత్సర్ (Amritsar)పోలీసులకు అనుమానం రావడంతో శివానీని పట్టుకున్నారు.
ప్రేమ కాదు, పిచ్చి కాదు, పిచ్చిప్రేమ..
పిచ్చి ప్రేమ ఎంత పని చేసిందో చూడండి. శివానీ తన ప్రియుడ్ని కలిసేందుకు భర్త, బిడ్డను వదిలి దేశ సరిహద్దుల వరకూ వెళ్లింది. అక్కడే ప్రియుడ్ని కలిసేందుకు ఆటో ఎక్కిన సమయంలో వాళ్ల ఫోన్ సంభాషణ విన్న ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శివానీ లవ్ జర్నీ ఆగిపోయింది. విషయం తెలియని ఆమె కుటుంబ సభ్యులు శివానీ కనిపించడం లేదని ధోల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు జలియన్ వాలాబాగ్ దగ్గర శివానీని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. జరిగిన విషయాన్ని పూర్తిగా వారికి చెప్పి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
జీవితం అంటే ఆట అనుకుంది..
సరదాగా సెల్ఫోన్లో లూడో గేమ్ ఆడుతున్న మహిళ..షడన్‌గా పరాయి దేశానికి చెందిన యువకుడి ప్రేమలో పడటం ఆశ్చర్యంగా ఉంది. అతడితో గడిపేందుకు తన జీవితాన్ని ఓ ఆటగా భావించడం సరికాదని పోలీసులు శివానీకి సర్ధి చెప్పారు. భర్త, బిడ్డతో కలిసి సంతోషంగా జీవించమని..ఇలాంటివి మరోసారి చేయకూడదని హెచ్చరించారు. సెల్ఫోన్లో చాటింగ్ ఎంతకైనా దారి తీస్తాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని ఇకపై ఎవరూ తమ జీవితాల్ని ఇలాంటి వ్యక్తులు, ఆటల మోజులో పడి నాశం చేసుకోకూడదనే పేర్లు, వివరాలు బయటపెడుతున్నామని ప్రకటించారు రాజస్థాన్ పోలీసులు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.