వేలానికి అతి పెద్ద చంద్ర శకలం... కొనుక్కుంటారా?

Moon Rock : ప్రపంచంలో అరుదైనవి మీ దగ్గర ఉండాలనుకుంటే... ఆ చంద్ర శిలను కొనుక్కోవచ్చు.

news18-telugu
Updated: May 4, 2020, 9:42 AM IST
వేలానికి అతి పెద్ద చంద్ర శకలం... కొనుక్కుంటారా?
వేలానికి అతి పెద్ద చంద్ర శిల... కొనుక్కుంటారా? (credit - twitter - ScienceTimes)
  • Share this:
Moon Rock : భూమికి సంబంధించినది కానిది ఏదైనా మీ చేతిలో ఉంటే... మీకు కలిగే థ్రిల్ మాటల్లో చెప్పలేం. అంతర్జాతీయ వేలం సంస్థ క్రిస్టీ... తాజాగా... చందమామ నుంచి ఒకప్పుడు భూమిపై పడిన ఓ రాయి లేదా ఉల్క లేదా చంద్ర శిల లేదా చంద్ర శకలాన్ని వేలానికి పెట్టింది. ఇది ఎంత పెద్దదంటే... అమెరికా అపోలో వ్యోమ నౌకల్లో చందమామ నుంచి వ్యోమగాములు తెచ్చిన రాళ్ల కంటే పెద్దది. వేలానికి పెట్టిన రాయిని NWA 12691 అని పిలుస్తున్నారు. భూమిపై చందమామకి చెందిన రాళ్ల మొత్తం బరువు 650 కేజీలకు కాస్త తక్కువ. వాటిలో ఈ ఒక్క రాయి బరువు 13.5 కేజీలు. దీని ప్రారంభ విలువ రూ.18 కోట్లు. ఆసక్తి ఉంటే కొనుక్కోవచ్చు.

చందమామ నుంచి ఇప్పుడు రావ‌డం తగ్గింది గానీ... ఒకప్పుడు కొన్ని రాళ్లు... అలా అలా వచ్చి... భూ వాతావరణంలోకి రాగానే... కాలిపోయి... ముక్కలైపోయేవి. చందమామను ఏదైనా గ్రహశకలం ఢీ కొడితే... అలాంటప్పుడు... చందమామ నుంచి రాళ్లు ముక్కలై... భూమిపై పడేవి. ఇలా... ఒకప్పుడు ఆఫ్రికా సహారా ఎడారి పశ్చిమ ప్రాంతంలో... దాదాపు 30 రాళ్లు (ఉల్కలు) పడ్డాయి. అన్నింటినీ ఏరి... వాటికి నంబర్లు ఇచ్చారు. ఇప్పుడు వేలానికి పెట్టిన రాయి... రెండేళ్ల కిందట సహారా ఎడారిలో దొరికింది.

moon, rock, meteorite, moon rock, cristee, auction, చంద్ర శిలలు, రాళ్లు, ఉల్కలు, చందమామ, గ్రహశకలం, సహారా, వేలం,
వేలానికి అతి పెద్ద చంద్ర శిల... కొనుక్కుంటారా? (credit - twitter - ScienceTimes)


క్రిస్టీ సంస్థ కొన్నేళ్లుగా ఇలా చంద్ర శిలలను అమ్ముతోంది. వాటన్నింటికంటే ఇప్పడు అమ్మేదే పెద్దది. దీనితోపాటూ... మరో 13 ఐరన్ ఉల్కల్ని (ఇనుము రాళ్లు) కూడా అమ్ముతోంది. వాటి మొత్తం ధరను రూ.13 కోట్లుగా నిర్ణయించింది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా... ఇప్పుడు ఎవరూ వీటిని కొనేందుకు ఆసక్తి చూపించట్లేదని తెలిసింది.
First published: May 4, 2020, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading