సెక్స్ డాల్స్‌ను బ్యాన్ చేయాలి.. నేరాలు పెరుగుతాయంటూ ఉద్యమం..

సెక్స్ డాల్స్ దక్షిణ కొరియాలో సమస్యగా మారాయి. వాటి వల్ల నేరాలు పెరుగుతాయంటూ ఉద్యమం ప్రారంభమైంది. దాదాపు 2.5 లక్షల మంది వీటికి వ్యతిరేకంగా ఓ ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు.

news18-telugu
Updated: August 14, 2019, 10:11 PM IST
సెక్స్ డాల్స్‌ను బ్యాన్ చేయాలి.. నేరాలు పెరుగుతాయంటూ ఉద్యమం..
(Image: Reuters)
  • Share this:
ఒకప్పుడు శృంగారం అంటే నాలుగు గోడల మధ్య సాగే రతి క్రీడ. కొత్త పుంతలు తొక్కుతూ ‘పోర్న్’ పేరుతో ఇంటర్నెట్‌లోకి ప్రవేశించింది.. ఆ తర్వాత సెక్స్ టాయ్స్ అంటూ టాయ్స్ ఇండస్ట్రీ విజృంభించింది.. ఇప్పుడు సెక్స్ డాల్స్ అంటూ మార్కెట్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వీటి హవా నడుస్తోంది. కొన్ని దేశాల్లో సెక్స్ డాల్స్‌పై నిషేధం ఉన్నా.. అక్రమంగా కొనసాగుతోంది. ఓ లెక్క ప్రకారం జపాన్ కంపెనీ డచ్ వైవ్స్ 2017లో 2వేల డాల్స్ అమ్మింది. అమెరికాలో 2014వ సంవత్సరంలో రూ.3వేల కోట్ల సెక్స్ డాల్స్ మార్కెట్ జరిగింది. అది 2023 నాటికి రూ.5వేల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా.

అయితే, ఇప్పుడు ఈ సెక్స్ డాల్స్ దక్షిణ కొరియాలో సమస్యగా మారాయి. వాటి వల్ల నేరాలు పెరుగుతాయంటూ ఉద్యమం ప్రారంభమైంది. దాదాపు 2.5 లక్షల మంది వీటికి వ్యతిరేకంగా ఓ ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. సెక్స్ డాల్స్ వాడినపుడు, వాటితో తృప్తి చెందకపోతే.. బయటికి వచ్చి అమ్మాయి కనిపిస్తే వారిపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని, తద్వారా నేరాలు పెరిగిపోతాయని కొందరు వాదిస్తున్నారు. కాగా, అక్కడి సుప్రీం కోర్టు మాత్రం వాటిని బ్యాన్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. సెక్స్ డాల్స్‌కు పోర్నోగ్రఫీకి చాలా తేడా ఉందని, డాల్స్‌ను వ్యక్తిగతంగానే వాడుతున్నారని అభిప్రాయపడింది.
First published: August 14, 2019, 10:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading