హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Pet Dog: అడవిలో స్పృహతప్పి పడిపోయిన యజమాని.. ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క..

Pet Dog: అడవిలో స్పృహతప్పి పడిపోయిన యజమాని.. ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క..

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విష సర్పాలు, క్రూర మృగాలు, దొంగల నుంచి కూడా పెంపుడు కుక్కలు యజమానులకు రక్షణ కల్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే తరహాలో ఓ పెంపుడు కుక్క అటవీప్రాంతంలో స్పృహతప్పి పడిపోయిన యజమానిని గుర్తించడంలో సాయం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పెంపుడు కుక్కలు తమ యజమానుల ప్రాణాలను కాపాడటంలో సాయపడిన ఘటనలు చాలా చూశాం. విష సర్పాలు, క్రూర మృగాలు, దొంగల నుంచి కూడా పెంపుడు కుక్కలు(Pet Dogs) యజమానులకు రక్షణ కల్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే తరహాలో ఓ పెంపుడు కుక్క అటవీప్రాంతంలో స్పృహతప్పి పడిపోయిన యజమానిని గుర్తించడంలో సాయం చేసింది. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించడంలో ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు. కర్నాటకలోని శివమొగ్గ(Shivmogga) తాలూకాలో జరిగిన ఈ ఘటన వివరాలు తెలుసుకుందాం.

శివమొగ్గ, హోసానగర్ తాలూకా సూడూరు గ్రామానికి చెందిన శేఖరప్ప(55) అనే వ్యక్తి శనివారం కట్టెల కోసం అడవికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబం, గ్రామస్థులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. కొన్ని గంటలపాటు అడవిలో గాలించినా శేఖరప్ప ఆచూకీ లభించలేదు. అప్పుడు వారికి శేఖరప్ప పెంపుడు కుక్క టామీ(Tommy) సాయం చేసింది. అడవిలో శేఖరప్ప(Shekarappa) అపస్మారక స్థితిలో పడిఉన్న చోటుకు వారిని తీసుకెళ్లింది. గ్రామస్థులు హుటాహుటిన శేఖరప్పను రిప్పన్‌పేటలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందిన అనంతరం శేఖరప్ప కోలుకున్నాడు. ఎండవేడిమి, అలసట కారణంగా బాధితుడు అపస్మారక స్థితికి చేరుకున్నట్లు వైద్యులు తెలిపారు.

* గంటపాటు వెతికినా దొరకని ఆచూకీ

హోసానగర్ తాలూకాలోని సూడూరు గ్రామానికి చెందిన శేఖరప్ప ప్రతిరోజూ సమీపంలోని అడవికి కట్టెల కోసం వెళ్తుంటారు. రోజూ ఉదయం 6 గంటలకు తన ఇంటి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవికి వెళ్లి ఉదయం 10 గంటలకు తిరిగి వస్తారు. ఆ తర్వాత ఆయనూరు పట్టణంలోని హోటల్‌లో పనికి వెళ్తాడు.

అయితే ఎప్పటిలాగే అడవికి వెళ్లిన శేఖరప్ప, శనివారం మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో అతని భార్య, కుమార్తె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. అతడు కట్టెల కోసం వెళ్లిన అటవీప్రాంతంలో 50 మందికి పైగా గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటలపాటు వెతికినా వారికి శేఖరప్ప ఆచూకీ లభించలేదు. అప్పుడే బాధితుడి కుటుంబం పెంచుకుంటున్న నల్ల కుక్క టామీ సెర్చ్ ఆపరేషన్‌లో చేరింది. అడవిలో అది అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కొంతసేపటికి సుదూర ప్రాంతంలో గట్టిగా మొరుగుతూ కనిపించింది. అది విన్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో.. ఓ చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న శేఖరప్ప కనిపించాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. శేఖరప్పను కాపాడటంలో టామీ చేసిన సాయంపై అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

Shocking news: ఆర్టీసీ బస్‌లో ల్యాప్‌టాప్ తీసుకెళ్తే బాదుడు .. ఎక్కడంటే..?

Viral video: బారాత్‌లో డ్యాన్స్‌ వీడియోకి 30లక్షల వ్యూస్ .. ట్రెండ్ సెట్ చేసిన వీడియో ఇదే..

* చివరి శ్వాస వరకు జాగ్రత్తగా చూసుకుంటా

ఈ ఘటన గురించి శేఖరప్ప టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడారు. తన చివరి శ్వాస వరకు టామీని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. ఎవరో వదిలేసిన ఆడ కుక్కకు ఏడేళ్ల క్రితం ఆశ్రయం కల్పించామని, టామీ అని పేరుపెట్టుకున్నామని చెప్పారు. శేఖరప్ప రోజూ అడవిలో వెళ్లే మార్గం కుక్కకు తెలుసని సూడూరు గ్రామానికి చెందిన శివన్న చెప్పాడు. టామీ సాయంతో శేఖరప్పను త్వరగా కనిపెట్టామని అన్నాడు.

First published:

Tags: Pet dog

ఉత్తమ కథలు