క్యారెట్ అనుకుని ఎలుగుబంటికి ఐ ఫోన్ విసిరాడు.. ఆ తర్వాత ఏమైంది?

జంతు ప్రదర్శనశాలకు వెళ్లినప్పుడు చాలామంది అక్కడి జంతువులను చూస్తూ మైమరిచిపోతుంటారు. ఆ ఏమరపాటులో ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోతారు. అలాంటి అనుభవమే ఇదీనూ.

news18-telugu
Updated: February 12, 2019, 5:56 PM IST
క్యారెట్ అనుకుని ఎలుగుబంటికి ఐ ఫోన్ విసిరాడు.. ఆ తర్వాత ఏమైంది?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 5:56 PM IST
జూలోకి వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అతని పరిస్థితిని చూసి చుట్టుపక్కల వాళ్లకే కాదు, నెటిజన్లకు కూడా ఎలా రియాక్టవ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. జంతు ప్రదర్శనశాలలోకి వెళ్లిన అతను.. అక్కడున్న ఎలుగుబంట్లకు ఆహారాన్ని విసురుతూ ఉల్లాసంగా గడుపుతున్నాడు. ఆ ఏమరపాటులో ఆహారం అనుకుని తన చేతిలో ఉన్న ఖరీదైన ఐ ఫోన్‌ను విసిరేశాడు. ఆ తర్వాత తేరుకున్న ఆ వ్యక్తి.. తాను చేసిన పనికి షాకయ్యాడు. ఈ ఘటన ఈస్ట్ చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లోని యాంచెంగ్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో జరిగింది. ఆ సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియా... ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

జూపార్క్‌లోకి వెళ్లిన వ్యక్తి తన చేతిలో ఉన్న క్యారెట్లను అక్కడి ఎంక్లోజర్‌లో ఉన్న ఎలుగుబంట్లకు విసరడం మొదలు పెట్టాడు. అనుకోకుండా క్యారెట్లతో పాటు తనచేతిలో ఉన్న ఐ ఫోన్‌ను కూడా విసిరేశాడు. ఆ ఫోన్‌ను ఎలుగుబంటి కాసేపు తదేకంగా చూసి.. నోట్లో కరచుకుని వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న జూ సిబ్బంది.. ఫోన్‌ను ఎలుగుబంటి నుంచి తీసుకురాగలిగారు. అయితే, అది అప్పటికే ధ్వంసమైపోయింది. దీంతో అలర్టయిన జూ సిబ్బంది పర్యాటకులెవ్వరూ జంతువులకు ఆహారం వేయవద్దని, ఓ పర్యాటకుడు ఆహారంతో పాట తన ఐఫోన్‌ను కూడా విసిరేశాడని తెలిపింది. అతనలా ఐఫోన్ విసిరిన వీడియోను ఓ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారిపోయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626