Video : ఉడుతల కోసం ఫార్ములా 1 గ్రాండ్ ప్రి... గెలిచిందెవరంటే...

ఫార్ములా 1 రేస్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో... ఈ ఉడుతల రేస్ కూడా అంతే థ్రిల్ కలిగిస్తోంది. మరి గెలుపెవరిది?

Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 9:18 AM IST
Video : ఉడుతల కోసం ఫార్ములా 1 గ్రాండ్ ప్రి... గెలిచిందెవరంటే...
ఉడుతల కోసం ఫార్ములా 1 రేస్ (Image : Youtube - Steve Barley)
  • Share this:
ఫార్ములా 1 రేస్ అంటే చాలా ఇష్టపడే స్టీవ్ బార్లీకి... తన ఇంటి పక్కన తిరిగే ఉడుతల కోసం ఆహారం పెట్టడం అలవాటు. ఐతే... అందరిలా తానూ చేస్తే కొత్తేముంది అనుకున్న బార్లీ... ఉడుతల కోసం పెట్టే ఆహారాన్ని ఫార్ములా వన్ రేస్‌గా మార్చాలనుకున్నాడు. ఏ ఉడుత తక్కువ టైమ్‌లో ఆహారం దగ్గరకు వెళ్తుందో అది గెలిచినట్లు లెక్క. ఐతే... ఉడుత ఆహారం దగ్గరకు వెళ్లే ముందు చాలా సాహసాలుంటాయి. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లే ఉడుత మాత్రమే విజయం సాధించగలదు. ఇలా అతను ఏర్పాటు చేసిన సెట్టింగ్స్... ఉడుతలకు బాగా నచ్చేశాయి. బార్లీ చెప్పిన రూట్‌లోనే వెళ్తూ... ఆహారాన్ని దక్కించుకుంటున్నాయి.


మొత్తం ఐదు ఉడుతలు ఈ రేస్‌లో పాల్గొనగా... అన్నింటి కంటే తక్కువ సమయంలో (1.58 నిమిషాలు) ఆహారాన్ని చేరుకున్న లెవిస్ స్క్రాంబెల్టన్ ఉడుతను ఛాంపియన్‌గా ప్రకటించాడు. అన్నింటికంటే తక్కువ టైమ్‌లో టార్గెట్ చేసుకున్న సర్జియో ఫ్లాయిరెజ్‌కి పెనాల్టీ కూడా వేస్తున్నట్లు సరదాగా ప్రకటించాడు స్టీవ్ బార్లీ. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.
First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading