ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) హల్చల్ చేస్తున్న ఓ చేప (fish) ఫొటో నెటిజన్లకు ఒళ్లు జలదరించేలా చేస్తోంది. ఈ భీతి గొలిపే ఫొటో చూస్తే పీడకలలు రావటం ఖాయమని మరికొందరు వణికిపోతున్నారు. అసలు ఏంటా చేప? దాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? తెలియాలంటే అమెరికా (America)లోని టెక్సాస్ స్టేట్ పార్క్‌కు వెళ్లాల్సిందే. తాజాగా గాల్వెస్టన్ ఐలాండ్ స్టేట్ పార్క్ అధికారులకు అట్లాంటిక్ క్రోకర్ అనే ఓ జాతి చేప (fish) తారసపడింది. వారు దాన్ని పట్టుకొని నోటి లోపల పరిశీలించారు. అప్పుడే వారికి ఓ పరాన్నజీవి (Parasite) కనిపించింది. అయితే చేప నాలుక మాత్రం మిస్సయినట్లు గుర్తించారు. ఆ పరాన్నజీవి చేప నాలుక (Tongue)ను ఏ మాత్రం మిగల్చకుండా పూర్తిగా తినేసిందని.. ఆపై అదే చేప నాలుకగా మారిపోయిందని తెలుసుకొని అవాక్కయ్యారు. టెక్సాస్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ చేపను ఫొటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
తనిఖీలు చేపట్టగా..
టెక్సాస్ గాల్వెస్టన్ ఐలాండ్ స్టేట్ పార్క్‌లో టెక్సాస్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ (Texas Parks and Wildlife in Galveston Island State Park, Texas) డిపార్ట్మెంట్ అధికారులు రెగ్యులర్ తనిఖీలు జరుపుతుండగా.. ఈ వింత చేప వారి కంట పడింది. దీని నోటిలోని పరాన్నజీవి చేప నాలుకను వేరు చేసి, ఆ తర్వాత చేప నోటికి అతుక్కుంటుందట. అనంతరం అది చేప నాలుక (fish toungue)గా మారి చేప శ్లేష్మాన్ని తింటుందని అధికారులు వివరించారు. ఈ పరాన్నజీవి అంగారక గ్రహం నుంచి వచ్చి పడిందంటూ ఓ అధికారి చమత్కరించారు.
ఏం జురుగుతుందంటే..
"గాల్వెస్టన్ ఐలాండ్ స్టేట్ పార్క్ వద్ద మార్టిన్ (పరాన్నజీవి) కనిపించింది. ఇది నిజంగా అంగారక గ్రహం నుంచి వచ్చింది కాదనుకోండి.. కానీ ఇది చాలా భయానకంగా ఉంది! ఈ అట్లాంటిక్ క్రోకర్ నోటి లోపల నాలుక తినే పేను (louse) అని పిలిచే పరాన్నజీవి ఐసోపాడ్ ఉంటుంది. ఈ పరాన్నజీవి చేపల నాలుకను ((fish toungue)) వేరు చేసి, చేప నోటికి అతుక్కుని, దాని నాలుకగా మారుతుంది. అప్పుడు ఆ పరాన్నజీవి చేపల శ్లేష్మాన్ని ఆహారంగా తీసుకుంటుంది" అని అధికారులు పేర్కొన్నారు. "ఒక పరాన్నజీవి క్రియాత్మకంగా దాని ఆతిథ్య జీవి అవయవాన్ని భర్తీ చేసిన ఏకైక ఘటన ఇదే. ఇది చేపలను చంపదు. మానవులపై కూడా ప్రభావం చూపదు." అని అధికారులు వివరించారు.
చేపల నాలుక (fish tongue)గా మారే పరాన్నజీవి గురించి తెలుసుకున్న నెటిజన్లు కొందరు భయపడుతున్నారు. ఇది తమ పీడ కలలో కనిపించిన జీవి లాగానే ఉందంటూ పేర్కొంటున్నారు. కొందరు మాత్రం ఈ చేప లోని పరాన్నజీవి (parasite) ఇంత ఘోరంగా ఉంది ఏంటి అని అసహ్యించుకుంటున్నారు. 'వామ్మో! ఇది చాలా భయానకంగా ఉంది.. ఇది నిజంగా విచిత్రంగా ఉంద'ని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హారర్ సినిమాలోని వింత, వికృత జీవు కంటే ఇదే మరింత భీతిని కలిగిస్తుందని చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టుకు ఇప్పటికే వందల్లో లైకులు, వేలల్లో షేర్స్ వచ్చాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.