పెళ్లికి ముందు సెక్స్ మంచిది కాదంటున్న భారతీయ యువత.. దేవుడిపై ఎంత భక్తి అంటే..

Pre-Marital Sex: తల్లిదండ్రులు, కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు తమను ఒక పరిధిలోనే ఉంచాయని చెబుతున్నారు. అవుట్‌లుక్-కార్వీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

news18-telugu
Updated: June 26, 2019, 10:30 PM IST
పెళ్లికి ముందు సెక్స్ మంచిది కాదంటున్న భారతీయ యువత.. దేవుడిపై ఎంత భక్తి అంటే..
ఈ సర్వేలో 57 శాతం మంది సెక్స్ కంటే హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికే మొగ్గు చూపగా... 25 శాతం సెక్స్ కావాలని కోరుకున్నారు.
 • Share this:
భారతదేశంలో ‘పెళ్లికి ముందు శృంగారం’ అన్న మాట అనగానే చెంప చెల్లుమనిపిస్తారు. కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలకు విలువ ఇస్తారు కాబట్టి అలాంటివి మంచివి కాదని హెచ్చరిస్తారు. ఇంట్లో పెద్దలే కాదు.. యువతీ యువకులైనా ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటారు. అయితే, పెరిగిన సాంకేతికత వల్ల కట్టుబాట్లకు, సంప్రదాయాలకు విఘాతం కలిగిందా? విలువలు కాలం చెల్లుతున్నాయా? అంటే అదేమీ లేదంటోంది భారతీయ యువత. తల్లిదండ్రులు, కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు తమను ఒక పరిధిలోనే ఉంచాయని చెబుతున్నారు. అవుట్‌లుక్-కార్వీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందు సెక్స్‌పై అభిప్రాయం కోరగా.. 66 శాతం మంది వద్దే వద్దని, 20 శాతం మంది కావాలని, 12 శాతం మంది ఓకే చెప్పినా తమకు మాత్రం వద్దని చెప్పగా, 2 శాతం మంది మాత్రం పెళ్లికి ముందు సెక్స్ మాకు సమ్మతమేనని, అయితే, ఆ వ్యక్తే తమ భాగస్వామి కావాలని కోరుకుంటున్నారట.

ఇక, హోమోసెక్సువాలిటీ అనేది వ్యక్తిగత ఎంపిక అని నాలుగింట మూడు వంతుల మంది అభిప్రాయపడుతున్నారు. పోర్న్ వెబ్‌సైట్లు యువతను పాడు చేస్తున్నాయని, వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని 50 శాతం మంది కుండబద్దలు కొడుతున్నారు. కాగా, కులాంతర, మతాంతర వివాహాలకు 57 శాతం మంది మద్దతు ఇస్తుండగా, 33 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. 10 శాతం మంది తటస్థంగా ఉన్నారు. ఇక, మహిళలు పాశ్చాత్య దుస్తులు వేసుకోవడానికి 76 శాతం మంది ఓకే చెప్పారు.

సర్వేలో తేలిన మరిన్ని విషయాలు:

 • 23 శాతం మంది యువత డేటింగ్ యాప్‌ను వాడుతున్నారు. అయితే, అందులో మహిళల పాత్ర తక్కువే.

 • మూడింట రెండు వంతుల మంది యువత వారానికి ఒకసారి గుడికి వెళ్తున్నారు.

 • నాలుగింట మూడు వంతుల మంది యువత తమ కుటుంబంలోని వారినే రోల్ మోడల్‌గా ఎంచుకుంటున్నారు.
 • 54 శాతం మంది యువతీ యువకులు ఎక్కువ సందర్భాల్లో అసహనానికి గురవుతున్నారు.

 • 34 శాతం మంది విద్యార్థి జీవితంలో రాజకీయాలు అవసరం లేదని భావిస్తున్నారు.

 • ఉగ్రవాదులు, రాజకీయ నాయకులు, మతవాదుల కన్నా పోర్న్ స్టార్లే దేశానికి ఎక్కువ నష్టం అని 22 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

 • ఏదేని పనిలో విజయవంతం కావడానికి స్త్రీ, పురుషుల భాగస్వామ్యం సమానంగా ఉండాలని 68 శాతం మంది చెబుతున్నారు.

 • వీలైనంతలో స్వస్థలంలోనే ఉద్యోగం వెతుక్కోవాలని 47 శాతం మంది భావిస్తున్నారు.

 • 35 శాతం మంది యువతకు అభిమాన బిజినెస్‌మేన్ అంబానీయే. ఆ తర్వాత 16 శాతం మంది రతన్ టాటాను అభిమానిస్తున్నారు.

 • 21 శాతం మందికి ఇష్టమైన క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని, ఆ తర్వాతి స్థానంలో 20 శాతం మంది విరాట్ కోహ్లీని ఇష్టపడుతున్నారు.

First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading