ఫేక్ న్యూస్‌ని ఎక్కువగా షేర్ చేసేది ఆ వయసువాళ్లే?

సోషల్ మీడియా ఎంతగా యాక్టివ్ అయ్యిందో.. దాని పుణ్యమా అని ఫేక్ న్యూస్ కూడా అదే రేంజ్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్లకు ఇప్పుడిదో తలనొప్పిగానూ మారిపోయింది. అయితే ఫేక్ న్యూస్‌ను ఎవరెక్కువ షేర్ చేస్తారో తెలుసా?

news18-telugu
Updated: January 12, 2019, 8:31 PM IST
ఫేక్ న్యూస్‌ని ఎక్కువగా షేర్ చేసేది ఆ వయసువాళ్లే?
Fake news
news18-telugu
Updated: January 12, 2019, 8:31 PM IST
సోషల్ మీడియా ఎంతగా యాక్టివ్ అయ్యిందో.. దాని పుణ్యమా అని ఫేక్ న్యూస్ కూడా అదే రేంజ్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్లకు ఇప్పుడిదో తలనొప్పిగానూ మారిపోయింది. అయితే ఫేక్ న్యూస్‌ను ఎవరెక్కువ షేర్ చేస్తారో తెలుసా? ఆ విషయం తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఎందుకంటే, అలాంటి అబద్ధపు వార్తలకు ప్రచారం కల్పించేది 65 ఏళ్ల వయసు పైబడినవారేనట. ఇది ఆషామాషీగా చెబుతున్న మాట కాదు. తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైన విషయం. ఈ  పరిశోధన ప్రకారం 65 ఏళ్ల వయసు పెద్దాళ్లు, యంగ్ స్టర్స్ కంటే ఎక్కువగా ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు స్పష్టమైంది.

‘‘లెస్ దెన్ యు థింక్: ప్రిలివెన్స్ అండ్ ప్రెడిక్టర్స్ ఆఫ్ ఫేక్ న్యూస్ డిస్సిమినేషన్ ఆన్ ఫేస్‌బుక్’’ పేరిట న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన ఈ కొత్త పరిశోధనలో 65 సంవత్సరాల వయసున్న వారు ఎక్కువగా ఈ ఫేక్ న్యూస్‌ను చూస్తున్నట్టు, వాటిని ఎక్కువగా తమ స్నేహితులకు షేర్ చేసేందుకు ఇష్టపడుతున్నట్టు వెల్లడైంది. మామూలుగా కాదు, యంగ్‌స్టర్స్ కంటే ఏడు రెట్లు ఎక్కువగా వీరు ఫేక్ న్యూస్‌ను షేర్ చేస్తున్నారట.

ఈ పరిశోధనలో వెల్లడైన ఫలితాల ప్రకారం 11 శాతం మంది 65 ఏళ్ల వయస్కులు ఫేక్ స్టోరీస్ లింకులను షేర్ చేయగా.. అవే ఫేక్ స్టోరీ లింకులను 3 శాతం మంది యంగ్‌స్టర్స్ మాత్రమే షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ జర్నల్‌లో దీనికి సంబంధించిన సమాచారం పబ్లిష్ అయ్యింది. అయితే, ఈ వయసు 65 పైబడిన వారు ఇలా ఎందుకు ఫేక్ న్యూస్ ఎక్కువగా షేర్ చేస్తున్నారనేదానికి మాత్రం సరైన సమాధానం దొరక లేదు. మొత్తానికి ఈ సర్వే ద్వారా.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ హాట్ టాపిక్‌గా మారుతోందనే విషయం స్పష్టమైంది.

First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...