హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Conjoined Twins: సిరిసిల్ల జిల్లాలో అవిభక్త కవలల జననం.. పొట్ట అతుక్కుని పుట్టిన చిన్నారులు

Conjoined Twins: సిరిసిల్ల జిల్లాలో అవిభక్త కవలల జననం.. పొట్ట అతుక్కుని పుట్టిన చిన్నారులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జన్మించిన అవిభక్త కవలలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జన్మించిన అవిభక్త కవలలు

Conjoined Twins: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అవిభక్త కవలలు జన్మించారు. ముస్తాబాద్ కు చెందిన లాస్యకు కవలలకు జన్మనిచ్చింది. అయితే జన్మించిన ఇద్దరు ఆడపిల్లలు పొట్ట అతుక్కుని జన్మించడం విశేషం.

  తెలుగు రాష్ట్రాల్లో అవిభక్త కవలలు వాణీ-వీణా గురించి తెలియని వారుండరు. తలలు రెండు కలిసి పుట్టిన ఆ ఇద్దరు అవిభక్త కవలలను చూసి ఆశ్చర్య పడాలో లేదా బాధ పడాలో తెలియని పరిస్థితి. ఇప్పటికీ వారిద్దరూ ప్రభుత్వ సంరక్షణలోనే ఉన్నారు. పెద్దగా అవుతున్నా కొద్దీ వారి సమస్యలు పెరుగుతున్నాయి. వారికి శాస్త్ర చికిత్స నిర్వహించేందుకు అనేక సార్లు వైద్యులు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉండడంతో వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో సారి అవిభక్త కవలలు జన్మించారు. ముస్తాబాద్ కు చెందిన లాస్య కవలలకు జన్మనిచ్చింది. అయితే జన్మించిన ఇద్దరు చిన్నారులు పొట్ట అతుక్కుని జన్మించడం విశేషం. ప్రస్తుతం కవలలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. వైద్య పరిభాషలో ఈ కవలలను ఒమ్ ఫాలోపాగస్ అని పిలుస్తారని డాక్టర్లు చెప్పారు. లక్షలో ఒకరు ఇలా జన్మిస్తారని ఆస్పత్రి నిర్వాహకులు డా. అనూష, డా ఎర్రవెల్లి చంద్రశేఖర్‌రావు వివరించారు.

  ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నా.. భవిష్యత్ లో వీరిని పెంచడం ఎలా అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. వీరికి ఆపరేషన్ చేసి వేరు చేయవచ్చా? లేదా? అన్న విషయంలోనూ ఇప్పటివరకు వైద్యులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వీరిని వేరు చేయడం సాధ్యం కాకపోతే.. వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఆ చిన్నారులకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ అవిభక్త కవలల విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

  వాణీ-వీణ ఫైల్ ఫొటో

  అవిభక్త కవలలు వీణా-వాణీలకు ఈ నెల పదహారున పుట్టిన రోజును జరుపుకున్నారు. వారు 17 ఏళ్లు పూర్తి చేసుకుని 18వ యేట అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో 2002 అక్టోబర్ 16న జన్మించిన వీరు...పుట్టినప్పటి నుంచి 13 ఏళ్లు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత శిశు విహార్‌కు తరలించారు. శస్త్రచికిత్సతో వీరిని సెపరేట్ అంశంపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం సహా మూడు వైద్య నిపుణుల కమిటీలు అధ్యయనం చేశాయి. అయితే వీరిద్దరిని సెపరేట్ చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని వైద్య నిపుణులు తేల్చడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.

  ప్రస్తుతం వీరు హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని స్టేట్ హోంలో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రభుత్వ సంరక్షణలోనే వారు ఉంటున్నారు. పుట్టిన రోజు నాడు తల్లిదండ్రులు స్టేట్ హోమ్‌కు రావడమే తప్ప...ఇప్పటి వరకు వారు తమ ఇంట్లో బర్త్ డే వేడుకులు జరుపుకునే పరిస్థితి లేదు. ఇటీవల వారిద్దరు పదో తరగతి పరీక్షల్లో మంచి గ్రేడ్లలో పాసైయ్యారు. తాను ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తానని వీణ చెబుతుండగా...తను సైంటిస్ట్ అవుతానని వాణి చెబుతోంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Sircilla, VIRAL NEWS

  ఉత్తమ కథలు