A MONKEY GUARDING A VEGETABLE SHOP IN MADHYA PRADESH AND THEN A VIDEO OF HIM EATING VEGETABLES ON A FULL STOMACH WENT VIRAL ON SOCIAL MEDIA SNR
OMG:కూరగాయలు అమ్ముతున్న కోతి..ఎక్కడో తెలుసా
Photo Credit:Youtube
OMG: మధ్యప్రదేశ్లో ఓ కోతి కూరగాయల వ్యాపారి అవతారమెత్తింది. రోడ్డు పక్కన ఉన్న కూరగాయల షాపులో కాసేపు కూర్చొని..తర్వాత కూరగాయలతో కడుపు నింపుకుంది. యజమాని వచ్చి దాన్ని బెదిరించినప్పటికి వెళ్లకుండా ..కడుపు నిండా కూరగాయల్ని తిన్న తర్వాత మెల్లిగా జారుకుంది. వానరం విచిత్రమైన వేషాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఓ కోతి ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ (Viral)అవుతోంది. సియోని(Seoni)లోని రోడ్డు పక్కన కూరగాయల షాపులో దర్జాగా కూర్చుంది కోతి(Monkey.కోతి వాలకం చూస్తుంటే కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్న షాపు ఓనర్లా కనిపిస్తోంది. ఈ విచిత్రమైన దృశ్యం రోడ్డుపై వెళ్తున్న వారిని కళ్లు అటువైపు తిప్పుకునేలా చేసింది. దీంతో అటుగా వెళ్తున్న వాళ్లు ఆశ్చర్యపోయి కోతి ప్రవర్తిస్తున్న తీరును తమ సెల్ఫోన్(Cell phone)తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ దృశ్యం సియోని నగరవాసులతో పాటు అందరికి తెలిసిపోయింది. నగరంలోని శుక్వారి చౌక్(Shukrwari Bazar)లో రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణం(Vegetable shop)దగ్గరకు ఓ కోతి వచ్చి చేరింది. అక్కడ షాపు యజమాని లేకపోవడంతో దర్జాగా ఓనర్ స్థానంలో కూర్చొని కూరగాయలు తింటోంది. యజమానికి విషయం తెలిసి వెంటనే అక్కడకు చేరుకొని కోతిని తరిమివేసే ప్రయత్నం చేశాడు. ఎంత తరిమినప్పటికి కోతి అక్కడి నుంచి కదల్లేదు. కడుపు నిండా కూరగాయలు తిన్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. చెట్లపై ఉండే కోతికి కడుపు నిండా ఆహారం దొరక్కపోవడంతోనే ఇలా కూరగాయల షాపుపై పడిందని అందరూ భావించారు. అయితే కోతి యజమాని వచ్చే వరకు షాపు దగ్గర కాపలా కాసి అతని ముందే కడుపు నిండా కూరగాయలు తిన్నదని స్థానికులు తెలిపారు.
ఇలాంటి కోతిని ఎక్కడైనా చూశారా..
కోతి కేవలం ఆకలి తీర్చుకునేందుకు మాత్రమే తన దుకాణానికి వచ్చిందని.. కడుపు నింపుకొని వెళ్లింది తప్ప ఎలాంటి నష్టం చేయలేదని దుకాణం యజమాని చెప్పాడు. ఎక్కడైనా వానరం చేష్టలు మాటల్లో వర్ణించలేనివి..ఒకసారి ఎవరైనా వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తే మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తాయి. అలాంటిది ఓ కూరగాయల దుకాణం దగ్గరకు వచ్చిన కోతి తన ఆకలి మాత్రమే తీర్చుకొని వెళ్లిన వీడియోని చూస్తున్న నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఎంత మంచి కోతో అని లైకులు కొడుతున్నారు.
నెటిజన్లను నవ్విస్తున్న వానరం..
సియోన్ నగరంలో కోతి చేష్టలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అందుకే కోతులు ఇళ్లలోకి చొరబడినా, లేక ఏదైనా ఆహార పదార్ధాలు తింటున్న వాటిపై దాడి చేయకపోతే అవి ఎలాంటి నష్టం కలిగించని..వాటి ఆకలిమాత్రమే తీర్చుకొని వెళ్లిపోయాని జంతు ప్రేమికులు చెబుతున్నారు. కోతులపై దాడి చేస్తే అవి భయంతో ఇంట్లో ఉన్న వస్తువుల్ని, వంట సామాగ్రిని తీసుకొని పారిపోతాయని గ్రహించమని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.