Viral video : ప్రపంచంలో అద్భుతమైన విన్యాసాలు చేసేవారికి కొదవలేదు. కొంతమంది ధైర్యవంతులు చేసే ప్రమాదకరమైన విన్యాసాలు చేసి చూపరుల గుండెలు ఆగిపోయేలా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇలాంటి విన్యాసాలు ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. Lo+Viral అనే ట్విట్టర్ అకౌంట్ లో తాజాగా షేర్ చేయబడిన ఓ వీడియోలో..ఓ వ్యక్తి యొక్క స్టంట్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక బైకర్ కెమెరా ముందు నిటారుగా ఉన్న కొండను బైక్‌తో ఎక్కి, పైకి చేరుకున్న తర్వాతే ఊపిరిపీల్చుకున్నాడు. ఆ వ్యక్తి బైక్ తీసుకుని కొండపైకి ఎక్కగానే చూపరులు ఊపిరి పీల్చుకున్నారు.
బైక్‌పై ఎత్తైన కొండపైకి ఎక్కాడు
ఆ స్టంట్‌మ్యాన్ ప్రమాదకరమైన స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అతను బైక్ తీసుకొని ఏటవాలు కొండ ఎక్కాడు. బైకర్ తన బైక్ స్పీడ్ పెంచి కొండ ఎక్కడం మొదలు పెట్టాడు. చూపరులు ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించారు. అతను తన ప్రయాణాన్ని పూర్తి చేయలేడని అందరూ భావించారు. ఎందుకంటే ఆ కొండపై ఉన్న ఎత్తుకు చేరుకోవడం కూడా బైక్‌తో అంత ఈజీ కాదు. కానీ ఆ వ్యక్తి వదలడానికి సిద్ధంగా లేడు, ఒక్కసారి స్పీడ్ పెంచి, కొండపైకి వెళ్లిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నాడు. వీడియో చూసి ఎవరైనా బైక్‌పై ఈ కొండ ఎక్కుతారని ఎవరూ ఊహించలేరు. అయితే జనాల ఊహలకు తూట్లు పొడిచి ఆ ఊహను నిజం చేశాడు బైకర్.
Sometimes the impossible is possible pic.twitter.com/aBcKXGV1eb
— Lo+Viral ???? (@TheBest_Viral) December 28, 2022
Video : కొంచెం విశ్రాంతి తీసుకోండి..తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న మోదీని ఓదార్చిన మమతా బెనర్జీ
స్టంట్‌ని చూపించి ఊపిరి పీల్చుకున్నాడు
వీడియో చూసి ఎవరైనా బైక్‌పై ఈ కొండ ఎక్కుతారని ఎవరూ ఊహించలేరు. అయితే జనాల ఊహలకు తూట్లు పొడిచి ఆ ఊహను నిజం చేశాడు బైకర్. చాలా మంది నెటిజన్లు దీనిని ప్రమాదకరమైన గేమ్ అంటూ కామెంట్స్ చేయగా, కొందరు వీడియో చూసిన తర్వాత తమ భయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఒక నెటిజన్... నిజంగా గొప్పది. ఏదైనా ఒక మలుపులో అది జారిపోతే ఇక జీవితం ముగిసినట్లే. ఎంతో ఆశతో రైడర్ రిస్కీ రైడ్ చేశాడు అంటూ కామెంట్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Video