గాయపడిన గుడ్లగూబకు ఒక వ్యక్తి సపర్యలు చేసి, దాన్ని సంరక్షించిన వీడియో ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అంతరించిపోతున్న జాతికి చెందిన ఆ గుడ్లగూబను దీనబంధు బాబు అనే వాలంటీర్ గుర్తించారు. గాయపడి ఉండటంతో దాన్ని చేరదీశారు. దాని ఆరోగ్యం మెరుగయ్యేందుకు చికిత్స చేశారు. పూర్తిగా కోలుకున్న తరువాత ఆ గుడ్లగూబను అడవిలోకి వదిలేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఈ వీడియోను చూసి మీరు సంతోషిస్తారు’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లను భావోద్వేగానికి గురవుతున్నారు. 1.33 నిమిషాలు ఉన్న వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
దీనబంధు బాబు అనే వ్యక్తి చూపులేని ఒక గుడ్లగూబకు చికిత్స చేస్తునట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆయన తప్పిపోయిన అడవి జంతువులను కాపాడే వాలంటీర్. దీనబంధు గురించి మరిన్ని వివరాలను పర్వీన్ కస్వాన్ ట్వీట్లో వివరించారు. ఆయన తరచుగా గాయపడిన, తప్పిపోయిన వణ్యప్రాణులను కాపాడతాడని చెప్పారు. అవి పూర్తిగా కోలుకునేవరకు వాటిని కంటికి రెప్పలా చూసుకుంటాడని తెలిపారు.
దీనబంధు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కొన్ని సంవత్సరాలుగా వణ్యప్రాణుల సంరక్షణకు పాటుపడుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో జంతువులను కాపాడారు. సివెట్ పిల్లులు, వివిధ రకాల పక్షులు, తాబేళ్లు, అన్ని రకాల పాములను దీనబంధు రక్షించారని కస్వాన్ చెప్పారు. గాయపడిన గుడ్లగూబ పూర్తిగా కోలుకున్న తరువాత దాన్ని తిరిగి అడవిలో వదిలేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ట్వీట్ చేసిన IFS అధికారి పర్వీన్ కస్వాన్.. ‘ఇతడి పేరు దీనబంధు బాబు. మా వాలంటీర్లలో ఒకరు. అతడికంటే ఎక్కువ అంకితభావం కలిగిన వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అడవి జంతువులను సంరక్షిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటీకీ, వణ్య ప్రాణులకు తప్పకుండా సమయం కేటాయిస్తాడు’ అని పేర్కొన్నారు.
ట్విట్టర్లో షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియో క్లిప్‌ను 45,000 మందికి పైగా చూశారు. గుడ్లగూబను కాపాడిన దీనబంధును చాలామంది నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. జంతువులపట్ల అతడి అభిరుచిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘మీరు చేసిన పని మా హృదయాన్ని తాకుతోంది. పక్షులకు తల్లిలా మీరు సేవ చేస్తున్నారు’ అని ఒక వ్యక్తి వీడియోకు కామెంట్ పెట్టారు. జంతువులను వేధిస్తూ వీడియోలు వైరల్ చేసేవారు మిమ్మల్ని చూసి మనసు మార్చుకోవాలని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.
He is Dinbandhu babu. One of our volunteer. I have never seen more dedicated person than him. From civet cats to birds & from turtles to all kind of snakes. He rescues them and look after them. Doing this form last many many years. By profession he is a government teacher.
వణ్యప్రాణులను కాపాడుతున్న మీలాంటి వాలంటీర్లకు ధన్యవాదాలని మరో యూజర్ కామెంట్ చేశాడు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.