ఓవైపు అవమానం మరోవైపు తనకు ఇష్టమైన కారు.. దీంతో ఓ వక్తి తనకు ఇష్టమైన కారును తీసుకుని అవమానం జరిగిన చోట ఉండకుండా జనాలు దూరంగా అడవిలో ఒంటరిగా ఉంటున్నాడు. అడవలలో ఉండడం సహజమే.. అది ఒంటరిగా ఉండడం కష్టమే కాని ఓ వ్యక్తి పదిహేడు సంవత్సరాలుగా ఉండడంతో వార్తల్లో వ్యక్తిగా మారాడు. అయితే ఆ వ్యక్తి అడవుల్లో ఉండడానికి కారణం మాత్రం ఇలా చెబుతున్నాడు.
కార్ణాటక ( karnataka ) రాష్ట్రంలోని మంగళూరు జిల్లా నెక్రల్ అనే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఆయన వ్యవసాయం ( agriculture ) చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2003లో తన ఎకరన్నర భూమిని తాకట్టు పెట్టి స్థానిక సహకార బ్యాంకులో (bank ) నలబై వేల రుణం తీసుకున్నాడు. అయితే పంటళు సరిగా పండకపోవడంతో పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల బ్యాంకు అప్పును తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంకు అధికారులు ఆయన పొలాన్ని వేసి డబ్బులు తీసుకున్నారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన చంద్రశేఖర్ గ్రామంలో ఉండలేకపోయాడు. అయితే ఆయనకు ఇష్టమైన ఓ కారు కూడా ఉండడంతో దాన్ని తీసుకుని స్వగ్రామం విడిచి తన సోదరీ ఇంటికి వెళ్లాడు. ఓ సంవత్సరం పాటు అక్కడే ఉన్నాడు. అయితే తన సోదరితో ( sister house ) కూడా విభేదాలు రావడంతో మనోవేదనకు గురైన చంద్రశేఖర్ తిరిగి గ్రామానికి వెళ్లలేకపోయాడు. తనను అవమానించిన గ్రామంలో ఉండలేని చంద్రశేఖర్ నేరుగా తన కారును తీసుకుని గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడవిలోకి ( forest ) వెళ్లాడు.
అంతే ఇక అక్కడే సెటిల్ అయ్యాడు. తన జీవితం మొత్తం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో లభించే పండ్లు తింటూ.. కొద్ది రోజులు జీవనం కొనసాగించాడు. నీళ్ల కోసం సెలయెళ్లను వాడుకున్నాడు. కారులోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కారుతో పాటు తాను ఉండేందుకు ఓ చిన్నపాటి గుడిసేను వేసుకుని బతకడం కోసం తనకు తెలిసిన బుట్టలు అల్లుకుంటూ వాటిని సమీప గ్రామాల్లో అమ్మి వచ్చి వాటి ద్వార తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు.
అయితే ఇలా ఒంటరిగా ( alone ) గత పదిహేడు సంవత్సరాలుగా అడవిలో ఉండడంతో విషయం కాస్త జిల్లా అధికారుకు తెలిసింది. వారు వచ్చి నచ్చజెప్పినా వినకుండా అక్కడే ఉంటున్నాడు. చివరకు జిల్లా కలెక్టర్ సైతం ( collector ) రాజశేఖర్ వద్దకు వెళ్లి ఆయనకు సొంత ఇళ్లు నిర్మిస్తామని చెప్పినా ఆయన మాత్రం గ్రామానికి వచ్చేందుకు ఇష్టపడలేదు.. తనకు ఇక్కడే బాగుందని చెబుతున్నాడు. అయితే అధికారులు కూడా అయన కోరికపై ఎలాంటీ ఒత్తిడి చేయలేదు.. ఆయన ద్వారా జంతువులకు ఎలాంటీ హాని లేదని చెప్పారు. దీంతో రాజశేఖర్ ఇలా 17 సంవత్సరాలుగా అడవిలో ఉంటుండంతో.. వార్తల్లోకి ఎక్కాడు.. దేశవ్యాప్తంగా మీడియా ఆయనపై కథనాలు రాస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, National News