Floating Ship : ఓడలు బండ్లవ్వడం గురించి విన్నాం కానీ విమానంలా ఆకాశంలో ఎగిరే ఓడ గురించి విన్నారా? బాహుబలిలో హంస నావ అంటే గ్రాఫిక్స్ వల్ల ఆకాశంలో ఎగిరింది కానీ నిజంగా అలా ఎగురుతాయా? అనుకుంటున్నారా?
ఓడలు బండ్లవ్వడం గురించి విన్నాం కానీ విమానంలా ఆకాశంలో ఎగిరే ఓడ గురించి విన్నారా? బాహుబలిలో హంస నావ అంటే గ్రాఫిక్స్ వల్ల ఆకాశంలో ఎగిరింది కానీ నిజంగా అలా ఎగురుతాయా? అనుకుంటున్నారా? నిజమే, అయితే స్కాట్లాండ్ (Scotland)కు చెందిన ఈ వ్యక్తి మాత్రం ఈ విచిత్రాన్ని ఫొటోలో బంధించి ఫేస్బుక్ (Facebook)లో పోస్ట్ చేశాడు. ఇక చూడండి, లైక్లు, కామెంట్లతో ఈ వార్త వైరల్ (Viral)గా మారింది.స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి గాలిలో ఎగురుతున్నట్లు ఉన్న ఒక షిప్ని చూసి నిశ్చష్టుడయ్యాడు. అబెర్డీన్షైర్ (Aberdeenshire) లోని బన్ఫ్ (Banff) టౌన్ నుంచి కోలిన్ మెక్కల్లమ్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ హోరిజాన్లో ఈ రెడ్ వెజిల్ కనిపించింది. ఫేస్బుక్లో అతడు పోస్ట్ చేసిన ఫొటోలో నీటిపైన కొంత ఎత్తులో షిప్ తేలుతున్నట్లు కనిపించింది. అసలు దీనికి కారణం ఏంటంటే, సముద్రమూ, ఆకాశము ఒకే రంగులో ఉండటం వల్ల షిప్ మబ్బుల్లో ఉన్నట్లు అనిపించింది. `ఈ రోజు బన్ఫ్ దగ్గర నిజజీవితంలో `ఆప్టికల్ ఇల్యూజన్`(Optical Illusion)ని చూశాను` అని 23 ఏళ్ల మెక్కల్లమ్ ఫేస్బుక్లో షేర్ చేసిన ఫొటోతో పాటు రాశాడు. ఇది ఇప్పడు వైరల్గా మారింది. మీరు కూడా చూడండి, మీకూ ఆశ్చర్యం కలిగించకమానదు.
ఈ పోస్టును దాదాపు రెండు వేల మంది షేర్ చేసుకున్నారు. దీనితో పాటు వెయ్యి మంది వరకూ ఆశ్చర్యపోయి, కామెంట్లు రాశారు. ఇందులో ఒక ఫేస్బుక్ యూజర్ స్పందిస్తూ, `నిజంగా, అక్కడ ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థంకాలేదు` అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే, మరొకరు `నిజంగా బ్రిలియంట్` అన్నారు. ఎవరినైనా ఆలోచింపజేసే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ గురించి మాట్లాడుతూ, మెక్కల్లమ్ ...`నేను ఈ పడవని మొదటిసారి చూసి, అర్థంకాక, మరోసారి తరచి తరచి చూడాల్సి వచ్చింది. ఎందుకంటే, నిజంగా అది ఆకాశంలో తేలుతుందేమోనని అనుకున్నాను`. `ఇంకొసారి దాన్ని గమనించిన తర్వాత, ఇదొక ఆప్టికల్ భ్రమ అని అప్పుడు అర్థమయ్యింది`. `మబ్బులు ఏర్పడటం వల్ల అలా జరిగింది. తీరం దగ్గరలో ఏర్పడిన మబ్బుల రంగు నేలకు సమీపంలో ఉన్న నీటి రంగును మబ్బుల రంగులోకి మార్చేశాయి. దీని వల్ల సముద్ర తీరం కూడా మబ్బుల రంగులో కనిపించింది. నీటికి దూరంగా ఈ షిప్ ఉండటం వల్ల, షిప్కి కింది భాగమంతా మబ్బులు ఉన్నట్లు, ఆకాశంలో షిప్ తేలుతున్న ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడింది.
ఇలా వస్తువులు నీటి కంటే పైన తెలినట్లు ఉండటం అనే ఆప్టికల్ భ్రమలు కొత్తవేమీ కాదు. ఇలాంటి సంఘటనలను `ఫటా మోర్గాన్ మిరాజ్` అంటారు. ఏవియేషన్ సేఫ్టీ వెబ్సైట్ స్కైబ్రరీ చెబుతున్న ప్రకారం, ఫాటా మోర్గాన్ అనేది నమ్మశక్యం కాని ఒక ఎండమావి. ఇది వాతావరణంలో వచ్చిన రిఫ్రాక్షన్ (Refraction) అంటే వక్రీభవనం వల్ల ఏర్పడుతుంది. ఇది వివిధ ఉష్ణోగ్రతల్లో ఉన్న గాలి పొరల మధ్య నుంచి కాంతి కిరణాలు వంగి వచ్చినప్పుడు ఏర్పడే పరిణామంగా చెప్పుకోవచ్చు.
ఫాటా మోర్గానా (fata morgana) అనేది ఒక ఎండమావి వంటిది. ఇక్కడ చూడటానికి కింద ఉన్న గాలి పైనున్న గాలి కంటే చల్లగా ఉంటుంది. ఇది ఉష్ణోగ్రతల మార్పు వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ కాంతి కిరణాలు వంగిపోతాయి. అప్పుడు అక్కడున్న దృశ్యం నిజంగా ఉన్న వస్తువు కంటే పైనున్నట్లు కనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడ కూడా ఇదే జరిగింది. అందుకే షిప్ (Ship) గాలిలో తేలుతున్నట్లు కనిపించింది.