Viral news: భార్యతో వేగలేక నన్ను జైలులో పెట్టండంటూ పోలీసులను వేడుకున్న వ్యక్తి.. పోలీసులు ఏం ఏశారంటే?

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా మళ్ళీ కలిసిపోతుంటారు. లేదంటే నేరుగా విడాకులు తీసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్యతో కాపురం చేయలేక ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు.

  • Share this:
పెళ్లయిన తర్వాత స్వేచ్ఛ కరువు అవుతుందని కొందరు దంపతులు (couples) ఫిర్యాదులు చేస్తుంటారు. భార్య (wife)తోనే అంటిపెట్టుకోవాల్సి వస్తుందని కొందరు మగవాళ్లు మొరపెట్టుకుంటే.. భర్త (husband) పెట్టే ఆంక్షలు తాళలేకపోతున్నామని భార్యలు వాపోతుంటారు. సాధారణంగా భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా మళ్ళీ కలిసిపోతుంటారు. లేదంటే నేరుగా విడాకులు (divorce) తీసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్యతో కాపురం చేయలేక ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు. భార్య నుంచి తనని కాపాడేందుకు తనని జైల్లో (jail) పెట్టాలని పోలీస్ స్టేషన్‌ (police station)కు వెళ్లి మరీ ప్రాధేయపడ్డాడు. సంసార జీవితం నరకంగా తయారైందని.. తన భార్య (wife)తో ఒక్క నిమిషం కూడా ఉండలేనంటూ అతడు వేడుకోవడం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారట. ఈ విచిత్ర ఘటన ఇటలీ (Italy)లో చోటుచేసుకుంది. కాగా ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లలో కొందరు అయ్యో పాపం అంటే.. మరికొందరు మాత్రం పగలబడి నవ్వుతున్నారు.

కొన్ని నెలలుగా ఇంటికే..

ఇటలీ (Italy) లోని గైడోనియా మోంటెసిలియో పట్టణంలో 30 ఏళ్ల అల్బేనియన్ పౌరుడు నివసిస్తున్నాడు. అతడు డ్రగ్స్ (drugs) సంబంధిత నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో పోలీసులు అతడిని హౌస్ అరెస్ట్ (House arrest) చేశారు. అప్పటి నుంచి గత కొన్ని నెలలుగా ఇంటికే (home) పరిమితమయ్యాడు. పోలీసులు విధించిన హౌస్ అరెస్ట్ పూర్తి కావాలంటే ఇంకొన్ని ఏళ్లు (few years) గడపాల్సి ఉండగా.. అతడు అది తన వల్ల సాధ్యం కాదని తక్కువ సమయంలోనే తెలుసుకున్నాడు. ముఖ్యంగా 24 గంటలూ భార్యతో సహజీవనం చేయలేకపోయాడు. ఇంట్లో ఓ బందీఖానగా భార్య (wife)తో జీవించడం నరకం (hell) అనుకున్నాడు.

భార్యతో ఉండటం కంటే జైలే బెటర్​..

భార్య (wife)తో కాపురం చేయడం కంటే జైలు (jail)కు వెళ్లి స్వేచ్ఛ, స్వతంత్ర జీవితం (Independent life) పొందడమే మేలు అనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సతీమణి నుంచి తప్పించుకొని ఇటలీ పోలీస్ (Italy police) అధికారులను ఆశ్రయించాడు. ఫ్యామిలీ లైఫ్ తో విసుగు చెందానని.. తనని భార్య నుంచి తనని కాపాడాలని అతడు పోలీసులను బతిమిలాడాడు. తనకు ఏ శిక్ష విధించారో అదే శిక్షను జైల్లో అనుభవించడానికి అనుమతి ఇవ్వాలంటూ కోరాడు. ఈ విషయాన్ని టివోలీ కారబినియరీకి చెందిన కెప్టెన్ ఫ్రాన్సిస్కో గియాకోమో ఫెర్రాంటే వెల్లడించారు.

నియమాలను ఉల్లంఘించినందుకు..

ఐతే గృహనిర్బంధ నియమాలను ఉల్లంఘించినందుకు గాను అతనిపై అభియోగాలు మోపారు పోలీసులు. అతని కోరిక మేరకే అతడి శిక్షను ఇంటి నుంచి జైలుకు బదిలీ చేయాలంటూ న్యాయ అధికారులు (Judges) స్థానిక పోలీసులను ఆదేశించారు. దీంతో సదరు భార్య బాధితుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడట. ఇంటి సమస్యల నుంచి తనకి విముక్తి కలిగించిన అధికారులకు ధన్యవాదాలు (Thanks) కూడా తెలిపాడట.
Published by:Prabhakar Vaddi
First published: