హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: ఇళ్లు కాలిపోతుంటే సోషల్​మీడియాలో లైవ్​ పెట్టిన ఘనుడు.. ఇదెక్కడి చోద్యం అంటూ నెటిజన్ల షాక్​

Viral video: ఇళ్లు కాలిపోతుంటే సోషల్​మీడియాలో లైవ్​ పెట్టిన ఘనుడు.. ఇదెక్కడి చోద్యం అంటూ నెటిజన్ల షాక్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కళ్ల ముందే నీ ఇల్లు బూడిదగా మారడం చూసి బాధపడుతారు. అయితే, ఒక వ్యక్తి ఇల్లు మంటల్లో కాలిపోతుంటే, అతను మాత్రం నవ్వుతూ ఫేస్‌బుక్‌లో లైవ్ చేస్తున్నాడు. ఇది చూసిన నెటిజన్లు నోరు తెరిచి ఆశ్చర్యపోయారు.

సోషల్​మీడియా (Social media)లో ఓ ఫొటో చక్కర్లు కొడుతూ ఉంటుంది. అదేంటంటే స్కూలు భవనం కాలిపోతుంటే ఓ విద్యార్థిని ఊయల ఊగుతూ నవ్వుతూ ఫొటో దిగుతుంది. ఈ ఫొటో చాలామందికి నవ్వు తెప్పించేదిలా ఉంటుంది. అప్పుడప్పుడు మీమ్​ క్రియేటర్లు కూడా ఆ ఫొటోను వాడుతుంటారు. అయితే అలా నిజంగా జరిగింది. అది ఎడిటింగ్​ చిత్రమా అంటే చాలామందికి అనుమానమే. ఇక అలాంటి ఘటనే ఒకటి జరిగింది అమెరికాలో. తన ఇల్లు మంటల్లో కాలిపోతుంటే ఫేస్‌బుక్‌ (Facebook)లో లైవ్ (live) షో పెట్టాడు ఓ వ్యక్తి. కొంతమంది తమ కలల ఇంటిని నిర్మించుకోవడంలో జీవితాంతం కష్టపడుతుంటారు. ఒక్కసారి ఊహించుకోండి, ప్రమాదం కారణంగా మీ ఇంటికి మంటలు అంటుకుంటే మీరు ఏమి చేస్తారో. సహజంగానే, మీరు మీ కలల ఇంటిని రక్షించడానికి మీ సర్వశక్తులు అడ్డు పెడతారు. కళ్ల ముందే నీ ఇల్లు బూడిదగా మారడం చూసి బాధపడుతారు. అయితే, ఒక వ్యక్తి ఇల్లు మంటల్లో కాలిపోతుంటే, అతను మాత్రం నవ్వుతూ ఫేస్‌బుక్‌లో లైవ్ చేస్తున్నాడు. ఇది చూసిన నెటిజన్లు నోరు తెరిచి ఆశ్చర్యపోయారు. షాకింగ్ ఘటన అమెరికా (America)లోని సౌత్ కరోలినాలో జరిగింది.

ఈ వీడియోలో వాయిస్​ వినిపిస్తుంది సామీ స్మిత్ (Sammy smith). సామీ వృత్తి రీత్యా మత బోధకుడు. ప్రజలకు మతానికి సంబంధించిన ప్రచార బోధనలు చేస్తూ ఉంటాడు. సామీ స్మిత్ అనే వ్యక్తి తన కాలిపోతున్న ఇంటిని ప్రజలకు చూపించడానికి ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. వీడియోలో సామీ తన ఇల్లు (house) కాలిపోతున్నట్లు చెప్పడం విశేషం. ఫేస్‌బుక్ లైవ్‌లో సామీ.. నా ఇల్లు కాలిపోతోంది. తన కూతురు బెడ్ రూం పూర్తి కాలిపోయిందంటూ.. యేసును స్మరిస్తూ, ‘ఓ మై గాడ్ జీసస్’.. ‘అంతా బూడిదగా ఉంది. నా కళ్ల ముందు ఏమి జరుగుతుందో మీరు చూడగలరా? అంటూ లైవ్ కామెంట్రీ (live commentary) చేశాడు.

‘దేవుడు చాలా మంచివాడని నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అతను మనందరి కోసం ప్రార్థనలు (prayers) చేస్తాడంటూ చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే.. సామీ కళ్ల ముందు తన ఇల్లు కాలి బూడిదైపోతున్నా.. నవ్వుతూ ఇదంతా ఫేస్ బుక్ లైవ్ లో చెప్పుకొచ్చాడు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం లేదు. కానీ, అతని కూతురు బెడ్ రూం పూర్తి కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో సామీ ఇంట్లో మంటలు చెలరేగడంతో అతని ఇరుగుపొరుగు వారు వెంటనే సహాయం కోసం పరిగెత్తారు.

ఫైర్​ సిబ్బందికి సమాచారం ఇచ్చి, వారు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఈ వీడియోలో సామీ తన పొరుగువారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చూడవచ్చు. ప్రజలు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో సామీ తన వీడియో ద్వారా వివరిస్తూ ఉండటం విశేషం. దీని తర్వాత సామీ తన ప్రాణాలను దేవుడు రక్షించాడని చెప్పాడు.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Fire Accident, Fire broke out, House

ఉత్తమ కథలు