Home /News /trending /

A MAN FROM MICHIGAN FOUND ALIEN COIN IN A ROLL OF QUARTERS WHICH WAS SENT THE INTERNET INTO A TIZZY SRD

Alien Coin : అమెరికాలో దొరికిన ఏలియన్ నాణెం.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ.. అసలు మ్యాటర్ ఇదే..!

Alien Coin (PC Credit : Reddit)

Alien Coin (PC Credit : Reddit)

Alien Coin : గ్ర‌హాంత‌ర వాసుల గురించి ఎన్నో సిద్ధాంతాలు, ఊహాగానాలు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే, గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నార‌న్న విష‌యాన్ని శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టివ‌ర‌కు ఆధారాల‌తో నిర్ధారించ‌లేదు. అయితే, సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ ఏలియన్ కాయిన్ మళ్లీ గ్రహాంతర వాసుల చర్చకు తెరలేపింది.

ఇంకా చదవండి ...
    ఏలియన్ల (Aliens) గురించిన చర్చ పురోగమి, తిరోగమిల వైపు రెండు వైపులకు దారి తీస్తుంది. కొందరేమే ఏలియెన్లే దేవుళ్లని వాదిస్తుండగా కొందరు సౌర కుటుంబం వెలుపలా ప్రాణులు జీవించే అవకాశం ఉండొచ్చు కదా అనే వాదన తెస్తుంటారు. ఈ చర్చ జరుగుతుండగా గ్రహాంతర వాసులను తాము చూశామని, కాదు కాదు.. వాటి వాహనాలు (UFO) చూశామని ఇంకొందరు చెబుతుంటారు. కొంద‌రు ప‌రిశోధ‌కులు గ్ర‌హాంత‌ర‌వాసుల‌పై ప‌రిశోధ‌న‌లు కూడా చేస్తున్నారు. అయితే, లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ ఏలియ‌న్ నాణెం చ‌క్క‌ర్లు కొడుతోంది. కానీ ఇటీవల ఓ వ్యక్తికి లభ్యమైన ఓ నాణెం మాత్రం అది ఏలియన్స్ కరెన్సీయా? అనేలా ఉంది. ఆ నాణెం మీద ఏలియన్ బొమ్మ ఉంది. అందుకే దాన్ని ఏలియన్స్ నాణెం అంటున్నారు. ఈ నాణెం సోషల్ మీడియా (Social Media)లో తెగ హల్ చల్ చేస్తూ తెగ వైరల్ అయిపోతోంది.

    అమెరికాలోని మిచ్ గాన్ కి చెందిన జోర్డాన్ అనే వ్య‌క్తికి క్వార్టర్స్ రోల్‌లో ఈ ఏలియన్ నాణెం దొరికింది. దానికి ఒక‌వైపు గ్రహాంతరవాసి తల ముద్రించి ఉంది. ఈ కాయిన్ ఫొటోను జోర్డాన్ త‌న రెడ్డిట్ అకౌంట్‌లో షేర్ చేశాడు. దీన్ని చూసి నెటిజ‌న్లు మొద‌ట ఆశ్చ‌ర్యపోయారు. అలాగే, ఆస‌క్తిగా గ‌మ‌నించారు. ఈ నాణెం రెండోవైపు ఏముంది? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. వెనుక భాగం అపోకలిప్స్ తేదీని చూపుతుంద‌ని, నాణెం కలిగి ఉన్నవారు మాత్రమే దానిని చూడగలర‌ని జోర్డాన్ స‌మాధానం చెప్పాడు.



    ఈ కాయిన్‌ను చివ‌ర‌గా హోబో నికెల్స్ అని నిపుణులు తేల్చారు. ఈ హోబో నికెల్స్ యూఎస్‌లో 20వ శ‌తాబ్దం ప్రారంభంలో ప్ర‌సిద్ధి చెందాయి. ఆ సమయంలో నిరాశ్రయులైన వ్యక్తులు కత్తులు, ఇతర సాధనాలను ఉపయోగించి వారు సొంతంగా నాణేల‌ను త‌యారుచేసుకున్నారు. వాటిని హోబో నికెల్స్ అని పిలుస్తారు. చిన్న విలువలతో కూడిన ఈ నాణేలను వారు వాడేవారు. 1913 నుంచి 1980 వరకు దాదాపు 200,000 క్లాసిక్ హోబో నికెల్‌లు చ‌లామ‌ణి అయిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి :  ఈ దిండు ఖరీదు తెలిస్తే నిద్రపట్టదు.. దీనికి మంచం కన్నా బీరువా అవసరమే ఎక్కువ..

    గ్ర‌హాంత‌ర వాసుల గురించి ఎన్నో సిద్ధాంతాలు, ఊహాగానాలు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే, గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నార‌న్న విష‌యాన్ని శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టివ‌ర‌కు ఆధారాల‌తో నిర్ధారించ‌లేదు. ఈ విశాల విశ్వంలో మాన‌వుడిని మించిన తెలివితేట‌లు ఏ జీవికీ లేవు. అయితే, ఒక‌వేళ ఏలియ‌న్స్‌కు మ‌న‌కంటే ఎక్కువ తెలివి ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతుంటారు. గ్ర‌హాంతర వాసుల ఉనికిని ప‌సిగట్టేందుకు సంబంధించిన ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. గ‌ణిత స‌మీక‌ర‌ణాల ఆధారంగానూ ఏలియ‌న్స్ గురించి ప‌రిశోధ‌కులు ప‌లు అంశాలను చెబుతుంటారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Aliens, America, Trending news, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు