హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: 180 డిగ్రీల కోణంలో తలను వెనక్కి తిప్పిన వ్యక్తి.. నెట్టింట వీడియో వైరల్

Viral video: 180 డిగ్రీల కోణంలో తలను వెనక్కి తిప్పిన వ్యక్తి.. నెట్టింట వీడియో వైరల్

Head Almost 180 Degrees

Head Almost 180 Degrees

ఎవరి తలనైనా పూర్తిగా వెనక్కి తిప్పితే ఏమవుతుంది? ఇదో ప్రశ్నా.. ఎవరైనా వెంటనే చనిపోతారు.. బతికే అవకాశం తక్కువ అని మీరనుకోవచ్చు.

ఎవరి తలనైనా పూర్తిగా వెనక్కి తిప్పితే ఏమవుతుంది? ఇదో ప్రశ్నా.. ఎవరైనా వెంటనే చనిపోతారు.. బతికే అవకాశం తక్కువ అని మీరనుకోవచ్చు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోక మానరు. తలను ఒక్కసారిగా 180 డిగ్రీల కోణంలో తిప్పి, అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాడు ఓ వ్యక్తి. తల సరిగ్గా వీపు వైపుగా ఉండేలా తిప్పి షాక్‌కు గురి చేస్తున్నాడు. @sheaabutt00 అనే టిక్ టాక్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. "ఇలా మీరు చేయగలరా" అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు.

వీడియోను గమనిస్తే ఓ వ్యక్తి (ఎవరో స్పష్టత లేదు) తన చేతులను గడ్డంపై ఉంచి తలను ఒక్కసారిగా వెనక్కి తిప్పినట్లు కనిపిస్తోంది. అనంతరం గడ్డాన్ని ఇంకా వెనక్కి నొక్కి తల ముందు భాగం సరిగ్గా వీపు వైపు ఉండేలా చేశాడు. 180 డిగ్రీల కోణంలో తలను తిప్పిన అనంతరం, మళ్లీ ఒరిజినల్ పొజిషన్ కు చేరుస్తాడు. నాకు డ్రింక్ కావాలి అంటూ ఓ వ్యక్తి మాటలు వీడియో బ్యాక్ గ్రౌండ్ లో మనకు వినిపిస్తాయి. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విన్యాసాన్ని ఇంట్లో అనుకరించకూడదని హెచ్చరిక కూడా జారీ చేసింది టిక్ టాక్.

ఇంట్లో అనుకరించవద్దు: టిక్ టాక్

ఈ విన్యాసాన్ని నిపుణుల పర్యవేక్షణలో చేశారని, ఇంట్లో అనుకరించవద్దంటూ టిక్ టాక్ వీడియో చివర్లో హెచ్చరిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 30 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 53 వేల మంది లైక్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. అతడికేమైనా భూత వైద్యం తెలుసేమోనని ఒకరు పోస్ట్ చేయగా.. ఇలాంటి టాలెంట్ అతడికి ఎలా వచ్చిందో అని ఇంకొకరు ప్రశ్నించారు. చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని మరోకరు కామెంట్ పెట్టారు.

ఇది చాలా అరుదైన వ్యాధి..

కొంత మంది వ్యక్తులు హైపర్ మొబైల్ జాయింట్స్ లేదా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడటం వల్ల ఈ విధంగా చేయగలుగుతారని సిమ్రాన్ డియో అనే డాక్టర్ తెలిపారు. చాలా అరుదుగా దీని బారిన పడతారని చెప్పారు. "కండరాలు, జాయింట్లు ఎక్కువ సాగదీసినప్పుడు వ్యక్తుల్లో కీళ్లు సాధారణం కంటే ఎక్కువ వంగి ఉంటాయి. పదే పదే ఈ విధంగా ప్రయత్నించడం వల్ల పక్షవాతం లేదా రక్త సరఫరా తగ్గి స్ట్రోక్ కు దారితీసే అవకాశముంటుంది" అని ఆమె అన్నారు.

First published:

Tags: Tik tok, Viral Video

ఉత్తమ కథలు