Viral Video: స్కేటింగ్ చేస్తుండగా విరిగిపోయిన మంచు.. సరస్సులో పడిపోయి నానా తిప్పలు.. వైరల్ వీడియో

మంచు విరిగిపోవడంతో కెనాల్ లో పడిపోయిన వ్యక్తి

తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ సరస్సుపై మంచు పేరుకుపోవడంతో ఓ వ్యక్తి స్కేటింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి మంచు విరిగిపోయింది. దీంతో అతడు ఆ సరస్సులో గడ్డకట్టే చలిలో పడిపోయాడు. ఆ తర్వాత..

  • Share this:
    మన దేశంలో తక్కువ కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో మంచు తుఫానులు కురుస్తుంటాయి. రోడ్లపై కుప్పలకు కుప్పలుగా మంచు పేరుకుపోయి ఉంటుంది. నదులు, సరస్సులు, సముద్రాలపై మంచు గడ్డకట్టుకుపోయి ఉంటుంది. మంచు తుఫాను తగ్గిన తర్వాత జనాలంతా బయటకు వచ్చి ఆ మంచు వద్ద ఫొటోలు తీసుకుంటుంటారు. ఇక నదులపై గడ్డకట్టుకుపోయిన మంచుపై సైకిళ్లతో తిరుగుతుంటుంటారు. స్కేటింగ్ చేస్తుంటారు. భారీ సంఖ్యలో జనాలు వచ్చి దాన్ని ఓ సందర్శన ప్రాంతంగా మలుస్తుంటారు. తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ సరస్సుపై మంచు పేరుకుపోవడంతో చాలా మంది పౌరులు స్కేటింగ్ చేస్తున్నారు. వారిలో ఓ వ్యక్తి స్కేటింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి మంచు విరిగిపోయింది. దీంతో అతడు ఆ సరస్సులో గడ్డకట్టే చలిలో పడిపోయాడు. దాన్నుంచి బయటకు వచ్చేందుకు అతడు చాలా పాట్లు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    నెదర్లాండ్ దేశ రాజధాని ఆమ్ స్టర్ డ్యాంలో కొద్ది రోజులుగా విపరీతమైన చలి ఉంది. మంచు విపరీతంగా పడటంతో ఆ నగరంలోని ప్రధాన సరస్సులపై మంచు పేరుకుపోయింది. దీంతో నగర పౌరులు సాయంత్రం పూట సరదాగా ఆ సరస్సుల వద్దకు చేరుకుంటున్నారు. ఫొటోలు తీసుకుంటూ నెట్టింట పోస్టులు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో కొందరు యువకులు ఆ గడ్డకట్టిన మంచుపై స్కేటింగ్ చేస్తున్నారు. నగరంలోని కైజర్స్ గ్రాట్ కెనాల్ పై కూడా భారీగా మంచు గడ్డకట్టుకుపోయింది. దీనిపై కొందరు స్కేటింగ్ చేస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది.



    ఓ వ్యక్తి కేవలం అండర్ వేర్ తోనే ఆ మంచుపై స్కేటింగ్ చేస్తున్నాడు. ఇంతలో అనుకోకుండా ఓ చోట మంచు విరిగిపోయింది. దీంతో అతడు ఆ సరస్సులో పడిపోయాడు. దాన్నుంచి బయటకు రాలేదక నానా తిప్పలు పడ్డాడు. లోపల నీళ్లు కూడా విపరీతమైన చల్లగా ఉండటంతో అతడి పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. పైకి రావడానికి మంచును పట్టుకుంటోంటే అది కాస్తా విరిగిపోవడం జరిగింది. ఓ స్కేటర్ అతడికి ఓ తాడును ఇవ్వడంతో మొత్తానికి ఎలాగోలా బయటపడగలిగాడు. 1.44 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 8 మిలియన్ల మంది వీక్షించారు. లక్షా 20 వేల మందికి పైగా లైక్ చేశారు. మరి ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.
    Published by:Hasaan Kandula
    First published: