A LITTLE BAT FLY FROM LONDON TO RUSSIA AND DIED BY A CAT ACCIDENTALLY PEOPLE CALLED THAT BAT AS OLYMPIAN BAT JNK GH
Olympic Bat: రికార్డు సృష్టించిన ఒలింపిక్ గబ్బిలం.. ఏకంగా 2వేల కిలోమీటర్లు ప్రయాణించి.. చివరకు పిల్లి చేతిలో చచ్చింది
ఆ గబ్బిలం ఏకంగా 2వేల కిలోమీటర్లు ప్రయాణించింది... కానీ చివరకు పిల్లి చేతితో చనిపోయింది.
నాథుసియస్ పిపిస్ట్రెల్స్ అనే గబ్బిలం పిపిస్ట్రెలస్ జాతికి చెందినది. ఇతర గబ్బిలాలతో పోలిస్తే చాలా చిన్నగా ఉండే ఇవి యూరప్ ఖండం అంతా కనిపిస్తుంటాయి. అలాంటి గబ్బలం చాలా పెద్ద సాహసమే చేసింది. ఇప్పుడు దాన్ని ఒలింపిక్ గబ్బిలం అని పిలుస్తున్నారు.
గాల్లో ఎగిరే పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు. కొన్ని జాతుల పక్షులకు ఒక ఖండం నుంచి మరొక ఖండానికి చేరుకోగల సత్తా ఉంటుంది. అయితే ఎగిరే జీవులలో చిన్నవైన గబ్బిలాలు, పిట్టలు మాత్రం పెద్ద పక్షుల మాదిరిగా ఎక్కువ దూరం ప్రయాణించలేవు. కానీ.. కేవలం 8 గ్రాముల బరువున్న ఒక గబ్బిలం లండన్ నుంచి రష్యాకు ప్రయాణించి సంచలనం సృష్టించింది. 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించిన ఈ గబ్బిలం ఒలింపిక్ టైటిల్ గెలుచుకుంది. అయితే చివరికి ఇది ఒక పిల్లి చేతిలో చనిపోయింది.
వివరాల్లోకి వెళితే.. నాథుసియస్ పిపిస్ట్రెల్ పేరు గల ఈ ఎగిరే క్షీరదం రెక్కపై 2016లో బ్రియాన్ రిగ్స్ అనే వ్యక్తి ఒక మార్కు వేశాడు. బెడ్ఫాంట్ లేక్స్ కౌంటీ పార్క్ లో ఈ గబ్బిలం రెక్కపై మార్క్ వేసిన తర్వాత అది చాలా దూరం ప్రయాణించింది. కేవలం మనుషుల బొటనవేలంత పరిమాణంలో ఉండే ఇది ప్రపంచ దేశాల్లో విహరిస్తూ చెక్కుచెదరని రికార్డును నెలకొల్పింది. లాత్వియా నుంచి నైరుతి దిశలో విహరించే మగ గబ్బిలాలు నెలకొల్పిన రికార్డులను ఇది బ్రేక్ చేసింది. బ్యాట్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రకారం, ఈ ఒలింపిక్ గబ్బిలం ప్రయాణం అత్యంత సుదీర్ఘమైనదని తెలుస్తోంది. బొటనవేలు అంత ఉండే ఒక చిన్న గబ్బిలం 2 వేల కిలోమీటర్లు ప్రయాణించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.
ఈ విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గబ్బిలాల మైగ్రేషన్ అధ్యయనాల్లో ఒక సరికొత్త విషయం కనిపెట్టేందుకు వీలయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నాథుసియస్ పిపిస్ట్రెల్స్ యూకే ఖండంలో చాలా రహస్యంగా విహరించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇకపోతే నాథుసియస్ పిపిస్ట్రెల్స్ అనే గబ్బిలం పిపిస్ట్రెలస్ జాతికి చెందినది. ఇతర గబ్బిలాలతో పోలిస్తే చాలా చిన్నగా ఉండే ఇవి యూరప్ ఖండం అంతటా విస్తరించాయి. శీతాకాలం సమయంలో ఇవి ఉత్తర-తూర్పు ప్రాంతాలకు వెళుతుంటాయి. ఇవి నైరుతి దిశగా ప్రయాణించడం వల్ల వీటికి వలస జీవులుగా పేరొచ్చింది. పిపిస్ట్రెల్స్ గబ్బిలం తల పొడవు కేవలం 46-55 మిమీ మాత్రమే ఉంటుంది. వాటి రెక్కల పొడవు 220-250 మిమీ మాత్రమే ఉంటుంది.
అయితే లండన్ నుంచి రష్యాకు ప్రయాణించిన నాథుసియస్ గబ్బిలం మొల్గినో అనే చిన్న గ్రామంలో ఒక పిల్లి దాడిలో తీవ్రంగా గాయపడింది. దీనిని మొదటగా స్వెత్లానా లాపినా అనే రష్యన్ వ్యక్తి గుర్తించారు. అనంతరం సంరక్షణ కేంద్రానికి తరలించారు. కానీ అది తీవ్ర గాయాల కారణంగా మృతి చెందింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.