జారుడుబల్ల ఆడుకున్న సింహం పిల్లలు... భలే భలే అంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో...

జారుడు బల్లకీ, పిల్లలకీ విడదీయరాని బంధం ఉంటుంది. మరి ఆ సింహం పిల్లలకు అడవిలో జారుడు బల్ల ఎక్కడ దొరికింది? ఎలా ఆడుకున్నాయి?

news18-telugu
Updated: July 6, 2020, 12:46 PM IST
జారుడుబల్ల ఆడుకున్న సింహం పిల్లలు... భలే భలే అంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో...
జారుడుబల్ల ఆడుకున్న సింహం పిల్లలు... భలే భలే అంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో... (credit - Youtube)
  • Share this:
మనుషుల పిల్లలైనా, ప్రాణుల పిల్లలైనా... పుట్టిన తర్వాత... ఈ ప్రపంచంలో చూసే ప్రతీదీ వింతగానే ఉంటుంది. అదే సమయంలో... కొత్తవి ఏవైనా సరే నేర్చేసుకోవాలనే తపన కూడా ఉంటుంది. ఆ సింహం పిల్లల్లోనూ ఆ ఉత్సాహం కనిపించింది. పిల్లలు చిన్నప్పుడు ఎలాగైతే జారుడు బల్లపై ఆడుతూ... అటూ ఇటూ పడుతూ, లేస్తూ ఉంటారో... ఆ సింహం పిల్లలు కూడా అలాగే చేశాయి. ఐతే... వాటికి ప్రత్యేకంగా తయారుచేసిన జారుడు బల్ల లేదు. అడవిలో... పడి వున్న కర్ర దుంగలే వాటికి జారుడు బల్లలు అయ్యాయి. దానిపైనే ఆడుతూ... ఊగుతూ, తూలుతూ, జారుతూ, పడుతూ సందడి చేశాయి.

డేనియల్ బెయిలీ ఈ సింహం కూనల ఆటలను వీడియో తీశారు. దక్షిణ ఆఫ్రికాలోని అడవుల్లో దృశ్యం ఇది. ఇప్పుడిప్పుడే అటవీ ప్రపంచాన్ని చూస్తున్న ఆ సింహం పిల్లలు... ఆ కర్ర దుంగలపై ఎక్కి జారుతూ ఎంతో ఆనంద పడ్డాయి. ఎలాగైనా కింద పడకుండా... ఊగాలి అనే పట్టుదల వాటిలో కనిపిస్తోంది.



యూట్యూబ్‌లోని ఈ వీడియోని నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. అవి కింద పడకుండా ఉండేందుకు చేసే ప్రయత్నం బాగుందని అంటున్నారు. ఇది సింహాల ప్లే గ్రౌండ్ అని కామెంట్స్ ఇస్తున్నారు. ఇది చూసి... చిన్నప్పుడు తాము ఆడుకున్న జారుడుబల్ల రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 6, 2020, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading