హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Lion: దర్జాగా హోటల్​లోకి ప్రవేశించిన సింహం.. ఆ తర్వాత – Viral video

Lion: దర్జాగా హోటల్​లోకి ప్రవేశించిన సింహం.. ఆ తర్వాత – Viral video

Twitter image

Twitter image

గుజరాత్​లోని ఓ హోటల్​లోకి సింహం (Lion) ప్రవేశించింది. పరిసరాల్లో తిరిగింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

  వణ్యప్రాణులు అడవులను వీడి జనావాసాలకు వస్తున్న ఘటనలు ఇటీవల అధికమవుతున్నాయి. పులులు, సింహాలు వంటి వణ్య మృగాలు తరచూ రహదారులపై కనిపిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు తగ్గిపోవడంతో పాటు నీరు దొరక్కకూడా ఒక్కోసారి అవి బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఏకంగా ఓ సింహం రోడ్లపై స్వేచ్ఛగా తిరిగింది. సమీపంలోని ఓ హోటల్ పరిసరాల్లోకి ప్రవేశించింది. అక్కడి ప్రాంతమంతా కలియతిరిగింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.

  గుజరాత్​ జునాగఢ్​లోని హోటల్ సరోవర్ పోర్టికోలో పరిసరాల్లో మృగరాజు విహరించింది. ఈ నెల 8న ఈ ఘటన జరిగింది. ముందుగా హోటల్ పార్కింగ్ ప్రదేశంలో సింహం తిరిగింది. ఆ తర్వాత ఎటువెళ్లాలో అర్థం కాక గోడ దూకి మళ్లీ బయటకు వెళ్లిపోయింది. రహదారిపై దర్జాగా నడుచుకుంటూ ముందుకుసాగింది. ఇది జరిగిన సమయంలో హోటల్​ మెయిన్ గేట్​ క్యాబిన్​లో సెక్యూరిటీ ఉన్నారు. సింహాన్ని చూసిన ఆయన కూడా భయపడిపోయారు.

  ఈ సీసీ టీవీ ఫుటేజీని ఉదయ్ కచ్​చీ అనే వ్యక్తి ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. “జునాగఢ్​ నగరంలో సింహాలు తిరగడం నిత్యం జరిగే విషయమై పోయింది” అని క్యాప్షన్ పెట్టారు. ఇందుకు సంబంధించి సింహం వివిధ ప్రదేశాల్లో తిరిగిన వీడియోలను పంచుకున్నారు.

  ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంతనంద కూడా తన టైమ్​లైన్​లో ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ సింహం వీడియోలు వైరల్ అయ్యాయి.

  అడవుల్లో నిర్మాణం చేపట్టడంతోనే సింహాలు వస్తున్నాయని, అది వాటి భూమి అని ఓ యూజర్ అభిప్రాయడ్డారు. మార్నింగ్​ వాక్​కు వెళ్లిన సమయంలో వణ్యప్రాణాలతో కలిసి జీవించాల్సిన సమయమని, దీన్ని అంగీకరించాల్సిందేనని మరో యూజర్ కామెంట్ చేశారు. జునాగఢ్​లో ఇవన్నీ సాధారణని అక్కడి స్థానికులు ఈ వీడియోకు స్పందించారు.

  Published by:Krishna P
  First published:

  Tags: Viral Video

  ఉత్తమ కథలు