సముద్రం(sea)లో చాలామంది చేపలు పట్టడానికి వెళతారు. మరికొందరు సరదాగా బోటింగ్(boating) చేస్తారు. అయితే సముద్రం ఒక ప్రపంచం లాంటిది. అందులో తిమింగలాలు, పెద్ద చేపలు, చిన్న చేపలు, మొసళ్లు తదితర జీవరాశులు ఉంటాయి. అంతేనా పెద్ద పెద్ద పాములూ(sea snakes) ఉంటాయి. మనం మామాలుగా సినిమాలో చూసే పెద్ద పెద్ద పాములు మనల్ని చూసి మనకోసం దగ్గరికొస్తే ఎలా ఉంటుంది. గుండెలు అదిరిపోతాయి. మరీ వీక్ హార్ట్లు(hearts) అయితే అక్కడే ఆగుతాయి కూడా. అలాంటి ఘటనే ఒకటి ఫ్లోరిడా(Florida)లో జరిగింది. సరదాగా బోటింగ్కి వెళ్లిన ఓ వ్యక్తిని పాము చూసి దగ్గరికొచ్చింది. అంతేనా ఆ పాము సరాసరి మనోడి దగ్గరికే వచ్చేసింది. అందులోనూ ఆ ప్రదేశంలో ఒక్కడే ఉన్నాడు. ఇక మనోడి గుండె ఎంత వేగంగా కొట్టుకొని ఉంటుందో చూడండి. అయితే ఆ సమయంలోనూ కూడా అతను ఆ ఘటనను వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పెట్టాడు.
ఇంతకీ ఏం జరింగిందంటే.. ఆస్ట్రేలియాకు(Australia) చెందిన యూట్యూబర్(YouTuber) బ్రాడీ మోస్(brodie moss) అనే వ్యక్తి బోటింగ్కి వెళ్లాడు. సముద్రం మధ్యలోకి వెళ్లాక తన బోటును నిలిపివేశాడు. అయితే తనకు సముద్రంలో వింతగా ఏదైనా కనిపిస్తే వీడియోలు, ఫొటోలు తీయడం అలవాటు. అదే సమయంలో ఓ పెద్ద పాము బోటు చూసేసింది. అంతే నేరుగా బోటును సమీపించింది. ఆ సమయంలో బ్రాడీ మోస్ కొంత భయాందోళనకూ గురయ్యాడు. ఇక పాము నేరుగా బోటు దగ్గరికి వచ్చి బోటు(boat)లో తల(head) పెట్టేసింది. కొద్దిసేపటి తర్వాత వెంటనే వెనక్కి తిరిగింది. నీటి లోపలికి వెళ్లిపోయింది. అయితే మోస్ కెమెరా పట్టుకుని అంతా రికార్డు చేశాడు. సోషల్ మీడియాలో పెట్టేశాడు. రెండు రోజులకే 50 లక్షల మంది వీక్షించారు ఈ వీడియోని(video). అయితే చాలామంది అసలు పాము సముద్రంలోపలికి ఎలా వెళ్లిందని అనుమానం వ్యక్తంచేశాడు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. పాము దాదాపు 800 ఫీట్ల లోపలికి వెళ్లగలదని, కొన్నిగంటల పాటు అక్కడే ఉంటుందని తెలిపారు.
View this post on Instagram
అయితే ఇంతకీ ఆ పాము ఎందుకు అతని దగ్గరికి వచ్చిందో కూడా నెటిజన్లు సెలవిచ్చారు. మామూలుగా పాములు చాలా సేపు ఒంటరిగా ఉండటంతో లైంగిక వాంఛలు పుడుతాయట. దీంతో తోడు కోసం బయటికి వస్తాయంట. ఇదే క్రమంలో బోటు కనిపించడం జరింగిందని, వెంటనే బోటు దగ్గరికి వచ్చిందని, తిరిగి వెళ్లిపోయిందని పలువురు సెలవిచ్చారు.
View this post on Instagram
మరో వీడియోలో పడవ కింది నుంచి తిమింగళం వెళ్లడం మనం గమనించవచ్చు. సాధారణంగా తిమింగళాలు కొన్ని మనుషులకు హాని తలపెడతాయి. దాడి చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తాయి. వీడియో పడవ కింది నుంచి వెళ్లినప్పుడు చాలా భయపడ్డానని ఆ వ్యక్తి తెలిపాడు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: చనిపోయిన 20 నిమిషాలకు లేచి మనిషిని చంపిన కోబ్రా.. ఎక్కడంటే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Baby sea lion, Florida, Ocean, Snake, Viral Video