Home /News /trending /

A LAKE FULL OF COCO COLA WATER IN BRAZIL PRV

Coca cola lake: వామ్మో.. ఆ సరస్సు నిండా కోకా కోలా నీరే.. ఎక్కడంటే?

కోకా కోలా సరస్సు

కోకా కోలా సరస్సు

బ్రెజిల్‌లోని రియో గ్రాండ్ డెల్ నొర్టె రీజియన్‌లోని మాటా డీ ఎస్టరలా రిజర్వ్‌లో ఈ కోకా కోలా సరస్సు ఉంది. అట్లాంటిక్‌ ఫారెస్ట్ రిజర్వ్‌లో ఇది ఉంది. దీనిని లగావో డీ కోకా కోలా అని కూడా పిలుస్తారు. అయితే వాస్తవానికి ఈ సరస్సు పేరు అరారాక్వారా సరస్సు. దానిలో ఉండే వాటర్ కలర్ కారణంగా ఇది కోకా కోలా లేక్ అనే పేరుతో పాపులర్ అయిపోయింది.

ఇంకా చదవండి ...


    కోకా కోలా సరస్సు ఒకటుందని ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా దానిని చూశారా? అదేంటి అసలు కోకా కోలా సరస్సు ఎలా ఉంటుంది అన్న అనుమానం వస్తోందా? ఆ ‘కోకా కోలా’లో స్నానం చేయాలని ఉందా? అయితే మీరు తప్పకుండా బ్రెజిల్‌కు వెళ్లాల్సిందే. దాన్ని చూసేందుకు ఎక్కెడక్కడి నుంచో సందర్శకులు వెళ్తున్నారు. ముఖ్యంగా పిల్లలు ఆ సరస్సులో జలకాలాడుతూ.. కోకా కోలాలోనే స్నానం చేస్తున్నట్లుగా ఫీలవుతున్నారు. ఈ సరస్సు కోకా కోలా డ్రింక్‌తో నింపిన సరస్సో లేక ఆ కంపెనీ ఏర్పాటు చేసిన సరస్సో కాదు. ప్రకృతి సహజంగా ఏర్పడిన లేక్ ఇది. బ్రెజిల్‌లో అతి పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ఆ దేశంలోని రియో గ్రాండ్ డెల్ నొర్టె రీజియన్‌లోని మాటా డీ ఎస్టరలా రిజర్వ్‌లో ఈ కోకా కోలా సరస్సు ఉంది. అట్లాంటిక్‌ ఫారెస్ట్ రిజర్వ్‌లో ఇది ఉంది. దీనిని లగావో డీ కోకా కోలా అని కూడా పిలుస్తారు. అయితే వాస్తవానికి ఈ సరస్సు పేరు అరారాక్వారా సరస్సు. దానిలో ఉండే వాటర్ కలర్ కారణంగా ఇది కోకా కోలా లేక్ అనే పేరుతో పాపులర్ అయిపోయింది.

    ఎందుకు అలా ఉంది?

    కోకా కోలా లేక్‌లో నీటిలో మునిగితే ఎటువంటి ప్రమాదం ఉండదు. టూరిస్టులు ఎవరూ ఈ నీటిలో మునగడానికి భయపడాల్సిన అవసరం లేదని, ఎటువంటి కాలుష్యం లేదని బ్రెజిల్ టూరిజం డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. పైగా ఈ నీటికి జబ్బులను పోగొట్టే శక్తి ఉందని లోకల్స్ నమ్ముతారట. చుట్టూ తెల్లటి ఇసుక తిన్నెలు, పచ్చటి చెట్లతో నిండిన కొండలు ఉండడం వల్ల ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం టూరిస్టులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది.

    ఎర్ర సముద్రం, నల్ల సముద్రం గురించి విన్నప్పుడు అవి పూర్తిగా ఆ రంగులోనే ఉంటాయని భావిస్తాం. కానీ, అవి అక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ఆయా రంగుల్లో కనిపిస్తాయి. అంతేగాక.. ఆ రంగులు దిక్కులను కూడా సూచిస్తాయట. ‘డెడ్ సీ’ విషయానికి వస్తే.. ఆ సముద్రంలో లవణ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనుషులు ఆ నీటిపై తేలుతారు. అలాగే బ్రెజిల్‌లో ఉన్న ‘కోకా కోలా’ సరస్సుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ‘రియో గ్రాండే డో నార్టే’లో  ఈ సరస్సును చూస్తే ‘కోకా కోలా’ డ్రింకు మొత్తాన్ని అందులోనే పోశారా అనిపిస్తుంది. వాస్తవానికి అది డ్రింక్ కాదు. పైగా అది కార్బోనేషన్‌కు కూడా గురికాలేదు. ఏ మిశ్రమం కలవకుండానే ఆ సరస్సు ఆ రంగులో కనిపిస్తుంది. ఆ సరస్సు ఆ రంగులో మారడానికి కారణం.. ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదే. అయోడిన్, ఐరన్ కేంద్రీకరణ వల్ల ఆ సరస్సులో నీరు ఆ రంగులోకి మారుతోందని పరిశోధకులు తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Brazil, Drinkers, Lake festival

    తదుపరి వార్తలు