• HOME
 • »
 • NEWS
 • »
 • TRENDING
 • »
 • A KARNATAKA FARMER WALKS 15 KILOMETRES TO CLEAR 3 RUPEE 46 PAISA BANK LOAN NK

బ్యాంకులో అప్పు రూ.3.46... తీర్చేందుకు 15 కిలోమీటర్లు నడిచిన రైతు...

బ్యాంకులో అప్పు రూ.3.46... తీర్చేందుకు 15 కిలోమీటర్లు నడిచిన రైతు...

ప్రతీకాత్మక చిత్రం

మన దేశంలో ఇప్పటికీ ఆ బ్రిటీష్ కాలం నాటి రూల్స్ కొన్ని ఉన్నాయి. వాటి వల్ల అన్నీ నష్టాలే జరుగుతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విచార సంఘటన.

 • Share this:
  మీకు ఎవరైనా 3 రూపాయల 46 పైసలు అప్పు ఉంటే మీరు ఏం చేస్తారు. పోనీలే.. అని వదిలేస్తారు. అంతేగానీ... ఆ అప్పు తీర్చాల్సిందే అంటూ ఒత్తిడి చెయ్యరు కదా. కానీ... మన దేశంలో బ్యాంకులు మాత్రం సింగిల్ పైసాతో సహా అప్పు వసూలు చేస్తాయి. అఫ్‌కోర్స్ ఈ రూల్... పేదలకు, మధ్య వర్తులకే వర్తిస్తోందన్నది బహిరంగ రహస్యం. సరే... ఈ ఘటనలో ఏమైందో తెలుసుకుందాం. అతో చిన్న రైతు. కర్ణాటకలోని... పచ్చదనంతో కళకళలాడే షిమోగా జిల్లాలో... ఓ కొండ ప్రాంతంలో ఉంటున్నాడు. అతను ఆల్రెడీ చేసిన అప్పంతా చెల్లించాడు. ఇంకా రూ.3.46 పైసలు చెల్లించాల్సి ఉంది. దాన్ని చెల్లించేందుకు ఏకంగా 15 కిలోమీటర్లు నడిచి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్లడానికి మరో 15 కిలోమీటర్లు. ఎంత బాధాకరం ఇది...

  ఆ బాధిత రైతు పేరు అమాదే లక్ష్మీనారాయణ. బారువే గ్రామంలో వక్కల (Areca Nuts) పెంపకం దారు. ఈ గ్రామం పశ్చిమ కనుమల్లో... దట్టమైన అడవుల్లో ఉంది. దగ్గర్లోని చిన్న పట్టణంలో కెనరా బ్యాంక్ ఉంది. తాజాగా అక్కడి నుంచి రైతుకి కాల్ వచ్చింది. "ఏంటి సారూ" అంటే... "ఏవయ్యా... నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నువ్వు అర్జెంటుగా రా" అన్నాడు బ్యాంక్ ఉద్యోగి. "ఏమైంది సారూ" అని అడిగితే... "నువ్వు చెల్లించాల్సి అప్పుడు పూర్తిగా చెల్లించలేదు. నువ్వు త్వరగా రా" అంటూ కాల్ కట్ చేశాడు.

  లాక్‌డౌన్ కారణంగా ఆ ఊరికి బస్సు సర్వీసు లేదు. బ్యాంక్ ఉద్యోగి వెంటనే రమ్మన్నాడుగా... అందువల్ల లక్ష్మీనారాయణ నడుస్తూనే 15 కిలోమీటర్లు వెళ్లాడు. అతని దగ్గర కనీసం సైకిల్ కూడా లేదు. బ్యాంకుకు వెళ్లి ఎంత అప్పుడు చెల్లించాలి సార్... అని అడిగితే... రూ.3.46 అని చెప్పారు. అప్పటివరకూ ఎక్కడా కింద పడిన ఆ రైతుకి.... వాళ్లు చెప్పిన అమౌంట్ విని షాక్ అయ్యాడు. ఏంటి సారూ... 3 రూపాయల 46 పైసలా అని అడిగాడు. ఆ ఉద్యోగి తెగ హడావుడి చేస్తూ... అవును... "ఆ డబ్బు చెల్లించలేదు నువ్వు" అన్నాడు. పీకల దాకా కోపం వచ్చినా అణచుకుంటూ ఆ రైతు... వెంటనే ఆ డబ్బు చెల్లించాడు.

  ఇంకాస్త వెనక్కి వెళ్దాం.....

  అదే బ్యాంకులో లక్ష్మీనారాయణ... రూ.35వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అందులో ప్రభుత్వం రూ.32వేలను మాఫీ చేసింది. అందువల్ల అతను రూ.3వేలు చెల్లించాల్సి ఉంది. అది ఆల్రెడీ చెల్లించాడు. ఐతే... మధ్యలో ఏవేవో లెక్కలు వేసి... ఇంకా రూ.3.46 పైసలు చెల్లించాలని అధికారులు అనుకున్నారు. అది చెల్లిస్తేనే... కొత్తగా మళ్లీ అప్పు ఇవ్వడానికి వీలవుతుందనీ... అందువల్లే ఆ మనీ అడిగామని బ్యాంక్ మేనేజర్ ఎల్ పింగ్వా తెలిపారు. రైతు నుంచి రుణం పూర్తిగా చెల్లించినట్లు సంతకం కూడా తీసుకున్నామని చెప్పారు.

  ఇప్పుడు అనిపించట్లా... ఎంత దారుణం అని... నెటిజన్లు అందరికీ అలాగే అనిపిస్తోంది. ఈ బ్యాంకులు... పేదల్ని ఒకలా... సంపన్నుల్ని (జస్ట్ లైక్ విజయ్ మాల్యా) మరోలా చూస్తాయని ఫైర్ అవుతున్నారు. బ్యాంకులు కావాలంటే... ఆ రూ.3.46 ఇతర ఖర్చుల్లో కలుపుకోవచ్చు. అంటే... టీ, పెన్సిల్, స్కేల్, రఫ్ పేపర్ లాంటి స్టేషనరీ కొనుగోళ్లలో కలుపుకోవచ్చు. కానీ... బ్యాంకుల అధికారులు... రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నామని అంటుంటారు. వాస్తవంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని ఫుల్లుగా మండిపడుతున్నారు నెటిజన్లు.
  First published: