Home /News /trending /

A HUSBAND WHO CAUGHT HIS ILLICIT WIFE IN JHARKHAND AND HANDED HER OVER TO HER BOYFRIEND SNR

మొగుడు వద్దు ప్రియుడే ముద్దు..జార్ఖాండ్‌లో భార్య బండారం బయటపెట్టిన భర్త


Photo Credit:Youtube

Photo Credit:Youtube

OMG: జార్ఖాండ్‌లో భర్తను వదిలించుకొని ప్రియుడితో వెళ్లిపోవాలనుకుంది ఓ వివాహిత. విషయం భర్త దృష్టికి రావడంతో వాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని గ్రామస్తుల ముందు నిలబెట్టాడు. తనను వద్దనుకున్న మహిళతో తిరిగి కాపురం చేయనని చెప్పి ఆమెను ప్రియుడికి అప్పగించి పీడ వదిలించుకున్నాడు.

ఇంకా చదవండి ...
కట్టుకున్న భర్త(Husband)ను వద్దు అనుకుంది. ప్రేమించిన ప్రియుడ్ని (Boyfriend) ఇంటికి పిలిపించుకుంది. ఎవరికి చెప్పకుండా ఇద్దరూ కలిసి పారిపోవాలని పథకం వేసుకున్నారు.  అనుకున్నట్లుగానే భర్తతో కలిసి ఉంటున్న వివాహిత ఇల్లు, ఊరు వదిలి ప్రియుడితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించి భర్తకు రెడ్ హ్యాండెడ్‌ (Redhanded)గా దొరికిపోయింది. భార్యభర్తల అనుబంధానికి మాయని మచ్చ తెచ్చిన ఘటన జార్ఖాండ్‌(Jharkhand)లోని పలాము (Palamu)జిల్లాలో జరిగింది. పలాము జిల్లా కేంద్రంలో నివాసముంటున్న వివాహిత భర్త, కుమార్తెతో కలిసి మెట్టినింట్లో ఉంటోంది. ఆమెకు కొద్ది రోజుల క్రితమే ఓ యువకుడు దగ్గరయ్యాడు. వాళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పటికే వివాహం చేసుకొని భర్తతో కాపురం చేస్తున్న మహిళ(Married woman)ప్రియుడి కోసం భర్త, కూతురు, అత్త, మామలను వదిలేయని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అతడితోనే ఉండాలని భావించింది. అందుకోసం పెద్ద స్కెచ్‌ వేసింది. ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయం చూసి ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుంది. అతడితో ఇల్లు వదిలి పారిపోయేందుకు ప్రయత్నించడంతో భర్త కంట పడింది. కట్టుకున్న భార్య వేరే యువకుడితో వెళ్లిపోతుండగా పట్టుకున్న భర్త వాళ్లిద్దరిని కుటుంబ సభ్యులు, గ్రామస్తుల మధ్యలో నిలబెట్టాడు. గుట్టుగా సాగుతున్న వారి అక్రమ సంబంధాన్ని బయటపెట్టాడు. అంతే కాదు..వేరే యువకుడితో వెళ్లిపోవాలనుకున్న మహిళను తిరిగి తాను భార్యగా స్వీకరించనని(Refused)..ఇంట్లో ఆశ్రయం కల్పించనంటూ (Accompanied)గ్రామస్తుల సమక్షంలో తేల్చి చెప్పేశాడు.

ప్రియుడి కోసం మొడుగు హ్యాండ్ ఇచ్చింది..
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన మహిళను భర్త తిరిగి భార్యగా స్వీకరించనని తెగేసి చెప్పడంతో గ్రామస్తులు ఆమె కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పి పంచాయితీ చేశారు. ఆమె ఎవరితో అయితే వెళ్లాలని ఇల్లు వదిలి వచ్చిందో ఆ ప్రియుడితోనే శాశ్వతంగా ఉండమని తీర్మానించారు. అంతే కాదు ఆ మహిళ చిన్న కూతుర్ని కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడి దగ్గరకే తీసుకెళ్లమని ఆదేశించారు గ్రామస్తులు.

కాపురం చేయనని భార్యను వదిలించుకున్న భర్త..
పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న భర్తను కాదని ప్రియుడితో వెళ్లాలనుకున్న వివాహిత బండారం గ్రామస్తుల సమక్షంలో బయటపడటంతో అవమానంతో తలదించుకుంది. ఇద్దర్ని ఊరి మధ్యలో కూర్చొబెట్టిన పెద్దలు భర్తతో, మెట్టినింటి వాళ్లతో  వివాహితకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ మహిళను ప్రియుడితోనే కలిసి జీవించాలని తీర్మానించారు గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ నిర్ణయాన్నిచెప్పడంతో వివాహితను, ఆ యువకుడ్ని  ఏమీ చేయకుండా వదిలిపెట్టారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Illegal affair, Jarkhand

తదుపరి వార్తలు