Viral Video: 'పెళ్లేమో కానీ.. పస్తులుండలేక చస్తున్నా'.. ఈ కొత్త పెళ్లి కూతురి పాట్లు ఈ వీడియోలో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో వధువు

సాధారణంగా పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు యువతులు. పెళ్లిలో ఆకర్షణీయంగా కనిపించాలని ఎంతగానో కష్టపడతారు. సన్నగా కనిపించేందుకు డైటింగులు కూడా చేస్తారు. తాజాగా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది ఓ నవ వధువు. పెళ్లి కోసం ఎంతగానో డైటింగ్ చేశానని, పెళ్లికి ముందు రోజు ఏమీ తినలేదని వాపోయిందామె. తన పెళ్లి కష్టాలన్నింటినీ ఒక వీడియోలో సరదాగా చెప్పింది.

  • Share this:
సాధారణంగా పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు యువతులు. పెళ్లిలో ఆకర్షణీయంగా కనిపించాలని ఎంతగానో కష్టపడతారు. సన్నగా కనిపించేందుకు డైటింగులు కూడా చేస్తారు. తాజాగా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది ఓ నవ వధువు. పెళ్లి కోసం ఎంతగానో డైటింగ్ చేశానని, పెళ్లికి ముందు రోజు ఏమీ తినలేదని వాపోయిందామె. తన పెళ్లి కష్టాలన్నింటినీ ఒక వీడియోలో సరదాగా చెప్పింది. అంతేకాదు పెళ్లి అయిపోయిన తర్వాత బాగా తింటానని, ఇష్టమైన వంటకాలను ఓ పట్టు పడతానని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోను గమనిస్తే.. ఉపాసన అనే వధువును పెళ్లి కోసం అలంకరించినట్లు కనిపిస్తోంది. పెళ్లి చీరను సర్దుతూ కొంతమంది ఆమెతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లి కోసం తిండి తగ్గించానని, దాదాపు 5 కేజీలు తగ్గానని చెబుతోంది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత బాగా ఎక్కువగా తినాలనుకుంటున్నట్లు చెప్పింది. పెళ్లి పనుల వల్ల ఒక రోజు ముందు నుంచి తినడానికి వీలుకాలేదని కూడా తెలిపింది.






ఓ సారి తినే అవకాశం వచ్చినా.. అప్పటికే ఆకలి చనిపోయిందని చెప్పింది. ఇప్పటి వరకు టిఫిన్ చేయలేదని, కనీసం టీ కూడా తాగలేదని తన సమస్యలను ఫన్నీగా చెప్పింది ఆ నవ వధువు. ఈ వీడియోను విట్టీ వెడ్డింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా వధువు ఇబ్బందిని చూసి ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన తరువాత పెళ్లి అంటేనే భయమేస్తుందని కొంతమంది పోస్ట్ చేశారు. భోజనం లేకపోయినా వధువు సంతోషంగానే ఉందని ఒకరు కామెంట్ చేశారు. ఈ వీడియోను మొదట వధువు మేకప్ ఆర్టిస్ట్ మనీషా సైనీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

‘పెళ్లిలో తినాలని ఎవరు అనుకుంటున్నారు’ అని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. దీన్ని ఇప్పటికే 16 వేల మంది చూశారు. ఇటీవల ఓ వధువు పెళ్లిలో పానీ పూరీ తింటున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ తరువాత పెళ్లిలో డైటింగ్ కష్టాలను గురించి వివరించిన ఈ నవ వధువు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Published by:Sambasiva Reddy
First published: