ఆకులను తిన్నదని.. మేకకు రూ.500 ఫైన్ వేశారు..

Telangana News: చెట్టుకు ఉన్న ఆకులను తిన్నదని ఓ మేకకు ఫైన్ వేశారు అధికారులు. ఈ వింత ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా చిలుకూరు గ్రామ పంచాయతీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 23, 2019, 6:13 PM IST
ఆకులను తిన్నదని.. మేకకు రూ.500 ఫైన్ వేశారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చెట్టుకు ఉన్న ఆకులను తిన్నదని ఓ మేకకు ఫైన్ వేశారు అధికారులు. ఈ వింత ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా చిలుకూరు గ్రామ పంచాయతీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్కలు నాటారు. అయితే, మేక ఆ మొక్కకు ఉన్న ఆకులను తినేసింది. ఈ సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి.. సదరు మేక యజమానికి రూ.500 జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవ్వరైనా సరే హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ధ్వంసం చేయాలని చూసినా, పీకేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

కాగా, హరితహారం మొక్క తిన్నందుకు మేకకు జరిమానా విధించడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. మేకకు ఫైన్ వేశారా? అంటూ చర్చించుకుంటున్నారు. కాగా, మొక్కల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Published by: Shravan Kumar Bommakanti
First published: August 23, 2019, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading