King Cobra video: పాముల్లో నాగుపాము చాలా ప్రమాదకరమైనది. అది కావాలని మనకు హాని చెయ్యదు గానీ... పడగవిప్పి... బుసకొట్టి కాటు వెయ్యడంలో... ఆ పాముకి తిరుగుండదు. పైగా అది చాలా పెద్ద సైజు పెరుగుతుంది. వేగంగా వెళ్తుంది. విషపూరితమైనది. అందుకే దాన్ని కింగ్ కోబ్రా అంటారు. ఈ పాము ఎక్కడైనా కనిపిస్తే... తుళ్లిపడతాం. ఎందుకంటే... చాలా పెద్దగా ఉంటూ.... సర్రున జారుకుంటుంది. అయితే మనలో కొంత మంది మాత్రం పాముల్ని కూడా ఎతో ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఈ విషయంలో వారు ఎంతో చాకచక్యత ప్రదర్శిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ పాము కాటు వెయ్యకమానదు. అయినా సరే... వాళ్లు ప్రాణాలకు తెగిస్తారు. ఇదెలా సాధ్యమంటే... వారు పాముల్ని ఎలా పట్టుకుంటే అవి సైలెంట్‌గా ఉంటాయో తెలిసిన వారై ఉంటారు.
ఇలాంటి ఓ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఆ వీడియోలో అమ్మాయి పేరు నాగేశ్వరి. ఆ వీడియోని ఆమే స్వయంగా పోస్ట్ చేసింది. ఆమె అకౌంట్ పేరు నాగేశ్వరి... స్నేక్ లవర్. ఆ వీడియోలో ... కొన్ని టైల్స్ కింద దాక్కున్న పామును ఆమె తెలివిగా బయటకు తీసింది. కొన్ని సెకండ్లపాటూ పాము ఆమె చేతుల్లో గిలగిలలాడింది. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. అప్పుడు ఆమె పామును దూరంగా వదిలేసింది. ఆ వీడియో మీరే చూడండి.
View this post on Instagram
పేరులోనే నాగును పెట్టుకున్న ఆమె... ఇలా ఇదివరకు కూడా చాలా పాముల్ని పట్టుకొని వదిలేసిది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇలాంటి చాలా పాములున్నాయి.
View this post on Instagram
ఈ కోబ్రా వీడియోని ఇప్పటికే 80 లక్షల మందికి పైగా చూశారు. చాలా మంది వావ్ అంటున్నారు. గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు. ఓ యూజరైతే కామెంట్స్ సెక్షన్‌లో ఇమోజీలతో నింపేశారు. మరో యూజర్ గ్రేట్ అక్కా అని మెచ్చుకున్నారు. ఇంకో యూజర్ సూపర్ నైస్ జాబ్ తాయ్ అని రాశారు.
View this post on Instagram
View this post on Instagram
ఇది కూడా చదవండి: చికెన్ ఎక్కువగా తింటున్నారా... ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి
నాగేశ్వరి ఇలాంటి పాముల్ని పట్టుకోవడానికి ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంది. అందువల్లే ఆమెకు సాధ్యమవుతుంది. ఇది చూసి ఎవరూ ఇలాంటివి చేయడం మంచిది కాదు. సరైన ట్రైనింగ్ లేకుండా పాముల్ని కాపాడాలని ప్రయత్నిస్తే... ప్రాణ రక్షణ కోసం అవి కాటు వేస్ ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాముల జోలికి వెళ్లకపోవడం మేలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Videos